“సమయము కుంచించుకు పోయే వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు

“సమయము కుంచించుకు పోయే వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “సమయము కుంచించుకు పోయే వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు. అప్పుడు ఒక సంవత్సర కాలం ఒక నెల లాగా ఉంటుంది; ఒక నెల ఒక వారం మాదిరిగా ఉంటుంది; ఒక వారం ఒక రోజులాగా ఉంటుంది; ఒక రోజు ఒక గంట మాదిరిగా ఉంటుంది; ఒక గంట ఒక ఖర్జూరపు ఆకు కాలిపోయినంత తక్కువగా ఉంటుంది.”

[దృఢమైనది] [దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథులో (క్రమంగా) సమయం కుంచించుకు పొవడాన్ని ప్రళయ ఘడియ స్థాపించబడే చిహ్నాలలో ఒకటిగా పేర్కొన్నారు. అపుడు ఒక సంవత్సరం ఒక నెల లాగా (అంత వేగంగా) గడిచిపోతుంది. నెల రోజుల కాలం ఒక వారం లాగా గడిచిపోతుంది. వారం రోజుల కాలం ఒక రోజు లాగా గడిచిపోతుంది. ఒక రోజు ఒక గంట లాగా గడిచిపోతుంది. ఒక గంట ఎంత త్వరగా గడిచి పోతుందంటే, ఒక ఖర్జూరపు ఆకు కాలిపోయినంత త్వరగా.

فوائد الحديث

ప్రళయ ఘడియ యొక్క సంకేతాలలో ఒకటి ఏమిటంటే – కాలము నుండి శుభాలు తీసివేయబడడం, కనుమరుగు కావడం లేక కాలము యొక్క ఉరవడి పెరిగిపోవడం.

التصنيفات

బర్జఖ్ జీవితం