إعدادات العرض
“అల్లాహ్ భూమిని ఒడిసి పట్టుకుంటాడు; ఆకాశాలను చుట్టచుట్టి (దానిని కూడా) తన కుడి చేతిలో పెట్టుకుంటాడు. అప్పుడు…
“అల్లాహ్ భూమిని ఒడిసి పట్టుకుంటాడు; ఆకాశాలను చుట్టచుట్టి (దానిని కూడా) తన కుడి చేతిలో పెట్టుకుంటాడు. అప్పుడు ఆయన ఇలా అంటాడు “నేనే రారాజును, భూమిపై (రాజరికం చేసిన) రాజులు ఏరీ, ఎక్కడున్నారు?”
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచిస్తుండగా నేను విన్నాను: “అల్లాహ్ భూమిని ఒడిసి పట్టుకుంటాడు; ఆకాశాలను చుట్టచుట్టి (దానిని కూడా) తన కుడి చేతిలో పెట్టుకుంటాడు. అప్పుడు ఆయన ఇలా అంటాడు “నేనే రారాజును, భూమిపై (రాజరికం చేసిన) రాజులు ఏరీ, ఎక్కడున్నారు?”
[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]
الترجمة
العربية English မြန်မာ Svenska Čeština ગુજરાતી Yorùbá اردو Bahasa Indonesia ئۇيغۇرچە සිංහල हिन्दी Hausa Kiswahili پښتو অসমীয়া دری Кыргызча or Türkçe Tiếng Việt नेपाली Kinyarwanda Bosanski Lietuvių Română മലയാളം Nederlands Soomaali Српски Kurdî Українська Deutsch ಕನ್ನಡ Wolof Moore Shqip Português ქართული Azərbaycan 中文 Magyar فارسی Македонски தமிழ் বাংলা Русский አማርኛ Malagasy Oromooالشرح
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ప్రళయదినము నాడు సర్వోన్నతుడైన అల్లాహ్ భూమినంతటినీ ఒడిసి పట్టుకుని ఒక చోటికి చేర్చి, ఆకాశాన్నంతటినీ చుట్టచుట్టి, వాటిని ఒకదానిపై ఒకటిగా పేర్చి తన కుడి చేతిలో పట్టుకుని వెళ్ళి వాటిని ధ్వంసం చేస్తాడు – అప్పుడు ఇలా అంటాడు: నేనే రారాజును ఏరీ ఆ భూమిపై రాజులు, ఎక్కడున్నారు?فوائد الحديث
ఇందులో – సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క సామ్రాజ్యము స్థరంగా నిలిచి ఉండేదని (శాశ్వతమైనదనీ), మరియు మిగతా వారి రాజ్యాలు బుద్బుదప్రాయమైనవని, క్షణికమైనవనీ ప్రస్తావించబడినది.
ఈ హదీథు – అల్లాహ్ యొక్క మహాత్మ్యం, ఆయన శక్తి యొక్క గొప్పతనం, ఆయన అధికారం, మరియు ఆయన రాజ్యం యొక్క పరిపూర్ణత గురించి మనకు బోధిస్తుంది