తౌహీదె అస్మా వ సిఫాత్

తౌహీదె అస్మా వ సిఫాత్

7- “మన ప్రభువు పరమ పవిత్రుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ప్రతి రాత్రి మూడవ భాగమున అన్నింటి కంటే క్రింది ఆకాశానికి దిగి వచ్చి* ఇలా అంటాడు: “ఎవరైనా ఉన్నారా నాకు మొరపెట్టుకునేవాడు (నాకు దుఆ చేసేవాడు) నేను అతని దుఆ కు స్పందిస్తాను; ఎవరైనా ఉన్నారా నన్ను ఏదైనా కోరుకునేవాడు, నేను అతనికి ప్రసాదిస్తాను; ఎవరైనా ఉన్నారా నా క్షమాభిక్ష కొరకు ప్రార్థించే వాడు, నేను అతడిని క్షమిస్తాను”.

9- “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా పలికినాడు: @ నా దాసుడు నా గురించి ఏమని భావిస్తాడో, నేను అతడు భావించినట్లుగానే అతనితో ఉంటాను*; అతను తనలో తాను నన్ను స్మరించినప్పుడు నాలో నేను అతడిని స్మరిస్తాను; ఒకవేళ అతడు నన్ను ఏదైనా సమావేశములో స్మరించినట్లయితే, అంతకంటే ఉత్తమమైన సమావేశములో నేను అతడిని ప్రస్తావిస్తాను; ఒకవేళ అతడు ఒక ‘షిబ్ర్’ అంత (జానెడంత) నాకు చేరువ అయితే, నేను ఒక ‘దిరా’ అంత (ఒక మూరెడు) అతనికి చేరువ అవుతాను; ఒకవేళ అతడు ఒక ‘దిరా’ అంత నాకు చేరువ అయితే, నేను ఒక “బాఅ” అంత (ఒక బారెడు) అతనికి చేరువ అవుతాను; ఒకవేళ అతడు నా వైపు నడుచుకుంటూ వస్తే, నేను అతని వైపునకు పరుగెత్తుకుంటూ వస్తాను.”

12- “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “పరమ పవిత్రుడు, సర్వోన్నతుడూ అయిన అల్లాహ్ ప్రకటన: @“ఓ ఆదం కుమారుడా! నీవు నన్ను వేడుకుని, నన్ను అర్ధించినంత కాలం, నా నుండి నీవు ఆశించినంత కాలం, నీలో ఏదైతే ఉన్నదో దానిని నేను క్షమిస్తాను మరియు దానిని నేను పట్టించుకోను*. ఓ ఆదం కుమారుడా! నీ పాపాలు ఆకాశపు మేఘాలను చేరేటంత ఎక్కువగా ఉన్నా, అపుడు నీవు నన్ను క్షమించమని వేడుకుంటే, నేను నిన్ను క్షమిస్తాను మరియు దానిని నేను పట్టించుకోను*. ఓ ఆదం కుమారుడా! నీవు భూమి అంత పెద్ద పెద్ద పాపాలతో నావద్దకు వచ్చినా, నాకు సమానంగా ఎవరినీ భాగస్వామిగా చేయకుండా నన్ను కలుసుకుంటే నేను అంతకంటే గొప్ప క్షమాపణతో నీ వద్దకు వస్తాను.”

13- “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అల్లాహ్ ఇలా పలికినాడు: @“ఆదం కుమారుడు నాపట్ల అసత్యం పలుకుతున్నాడు, అలా చేయడానికి అతనికి ఏ హక్కూ లేదు; మరియు అతడు నన్ను అవమాన పరుస్తున్నాడు, అలా చేయడానికి అతనికి ఏ హక్కూ లేదు*. నా పట్ల అతడు అసత్యం పలకడం ఏమిటంటే – “చనిపోయిన తరువాత (పునరుత్థాన దినమున) నన్ను తిరిగి సజీవుడిని చేయలేడు” అని అతడు అనడం. నిజానికి మొట్టమొదటి సారి అతడిని సృష్టించడం కంటే; అతడిని పునరుజీవింపజేయడం కష్టమైనదేమీ కాదు. నన్ను అతడు అవమాన పరచడం ఏమిటంటే – అతడు “అల్లాహ్ ఒక కుమారుడిని కలిగి ఉన్నాడు” అని అనడం, వాస్తవానికి నేను నేనే, ఏకైకుడను, ఎవరి అక్కరా లేని వాడను, నాకు సంతానము లేదు (నాకు ఎవరూ సంతానం కాదు), మరియు నేను ఎవరి సంతానమూ కాదు, మరియు (సర్వలోకాలలో) నన్ను పోలినది ఏదీ లేదు.”

15- “మీలో ఎవ్వరితోనూ అల్లాహ్ మాట్లాడకుండా ఉండడు (మీలో ప్రతి ఒక్కరితో అల్లాహ్ మాట్లాడుతాడు); మరియు అతనికీ, అల్లాహ్ కు మధ్య అనువాదకుడు కూడా ఉండడు*. అతడు తన కుడివైపు చూస్తాడు అక్కడ అతడు తాను ముందుకు పంపిన దానిని తప్ప (తన ఆచరణలను తప్ప) మరేమీ చూడడు, మరియు అతడు తన ఎడమవైపు చూస్తాడు, అక్కడ అతడు ముందుకు పంపిన దానిని తప్ప (తన ఆచరణలను తప్ప) మరేమీ చూడడు. మరియు అతను తన ముందు వైపునకు చూస్తాడు; అతనికి ఎదురుగా నరకాగ్ని తప్ప మరేమీ కనిపించదు. కనుక నరకాగ్ని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి – అది ఖర్జూరములో సగభాగముతోనైనా సరే.

16- “మస్జిదులోనికి ప్రవేశించునపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు@ “అఊదుబిల్లాహిల్ అజీం, వబి వజ్’హి హిల్ కరీం; వ సుల్తానిల్ ఖదీమ్; మినష్’షైతానిర్రజీమ్”* (నేను అల్లాహ్ యొక్క కరుణాపూరితమైన వర్చస్సు ద్వారా; (సర్వసృష్టిపై) ఆయన శాశ్వతమైన ఆధిపత్యము ద్వారా; శపించబడిన షైతాను బారి నుండి మహిమాన్వితుడైన అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాను)”. అది విని అక్కడ ఉన్న అతను “అంతేనా?” అన్నాడు. దానికి నేను “అవును” అన్నాను. అపుడు అతడు ఇలా అన్నాడు “ఆ పదాలు పలికినపుడు షైతాను ఇలా అంటాడు “ఇతడు రోజంతా నా నుండి రక్షించబడినాడు.”

20- “అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు మాతో ఇలా అన్నారు: “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాడు “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం ! తీర్పు దినమున అవిశ్వాసి తన ముఖము పై (నడిచేలా) ఎలా సమీకరించబడతాడు?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “@ అతడిని ఈ భూమి మీద కాళ్ళపై నడిచేలా చేయగలిగిన శక్తిమంతుడు (అయిన అల్లాహ్), తీర్పు దినమున అతడిని ముఖముపై నడిచేలా చేయలేడా?*” అన్నారు. ఖతాదహ్ ఇలా అన్నారు “అవును, మా ప్రభువు (అయిన అల్లాహ్) గౌరవం సాక్షిగా (ఆయన అలా చేయగల శక్తిశాలి)”.