“నిశ్చయంగా అల్లాహ్ అభిమానవంతుడు, విశ్వాసి కూడా అభిమానవంతుడే. అల్లాహ్ యొక్క అభిమానము అంటే దాసుడు అల్లాహ్…

“నిశ్చయంగా అల్లాహ్ అభిమానవంతుడు, విశ్వాసి కూడా అభిమానవంతుడే. అల్లాహ్ యొక్క అభిమానము అంటే దాసుడు అల్లాహ్ నిషేధించిన వాటికి పాల్బడుట (అనగా అల్లాహ్ యొక్క అభిమానము భంగపడినట్లు).”

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా అల్లాహ్ అభిమానవంతుడు, విశ్వాసి కూడా అభిమానవంతుడే. అల్లాహ్ యొక్క అభిమానము అంటే దాసుడు అల్లాహ్ నిషేధించిన వాటికి పాల్బడుట (అనగా అల్లాహ్ యొక్క అభిమానము భంగపడినట్లు).”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసు లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: నిశ్చయంగా అల్లాహ్ అభిమానవంతుడు, ఆయన కొన్ని విషయాలను అసహ్యించుకుంటాడు, కొన్ని విషయాలను అయిష్టపడతాడు; అలాగే విశ్వాసి కూడా అభిమానవంతుడు, అతడూ కొన్ని విషయాలను అసహ్యించుకుంటాడు, కొన్ని విషయాలను అయిష్టపడతాడు. అల్లాహ్ యొక్క అభిమానము ఎప్పుడు భంగపడుతుందంటే, విశ్వాసి అల్లాహ్ నిషేధించిన కార్యాలకు పాల్బడినప్పుడు, ఉదాహరణకు: వ్యభిచారము, స్వలింగ సంపర్కము, దొంగతనము, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు సేవించడం, ఇంకా అటువంటి అనైతిక కార్యాలకు పాల్బడుట.

فوائد الحديث

అల్లాహ్ నిషేధితాల ఉల్లంఘనకు గురైతే, అల్లాహ్ యొక్క క్రోధాగ్నికి, ఆయన విధించే శిక్షకు తయారుగా ఉండాలి.

التصنيفات

తౌహీదె అస్మా వ సిఫాత్