إعدادات العرض
“మన ప్రభువు పరమ పవిత్రుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ప్రతి రాత్రి మూడవ భాగమున అన్నింటి కంటే క్రింది ఆకాశానికి దిగి…
“మన ప్రభువు పరమ పవిత్రుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ప్రతి రాత్రి మూడవ భాగమున అన్నింటి కంటే క్రింది ఆకాశానికి దిగి వచ్చి
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మన ప్రభువు పరమ పవిత్రుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ప్రతి రాత్రి మూడవ భాగమున అన్నింటి కంటే క్రింది ఆకాశానికి దిగి వచ్చి ఇలా అంటాడు: “ఎవరైనా ఉన్నారా నాకు మొరపెట్టుకునేవాడు (నాకు దుఆ చేసేవాడు) నేను అతని దుఆ కు స్పందిస్తాను; ఎవరైనా ఉన్నారా నన్ను ఏదైనా కోరుకునేవాడు, నేను అతనికి ప్రసాదిస్తాను; ఎవరైనా ఉన్నారా నా క్షమాభిక్ష కొరకు ప్రార్థించే వాడు, నేను అతడిని క్షమిస్తాను”.
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Türkçe اردو 中文 हिन्दी Tagalog Kurdî Português മലയാളം Kiswahili தமிழ் සිංහල မြန်မာ ไทย Русский 日本語 پښتو Tiếng Việt অসমীয়া Shqip Svenska Čeština ગુજરાતી አማርኛ Yorùbá Nederlands ئۇيغۇرچە Hausa دری Magyar Italiano ಕನ್ನಡ Кыргызча Lietuvių Malagasy Română Kinyarwanda नेपाली Српски Soomaali Deutsch Moore Українська Български Wolofالشرح
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: సర్వోన్నతుడు, సకల శక్తి సంపన్నుడు, పరమపవితృడైన అల్లాహ్ ప్రతి రాత్రి చివరి మూడవ భాగము మిగిలి ఉన్న సమయాన అన్నింటి కంటే క్రింది ఆకాశానికి దిగి వస్తాడు. ఆయన తన దాసులను కోరుతాడు ఆ ప్రత్యేక సమయాన తనకు దుఆ చేయమని, తాను వారి దుఆలకు స్పందిస్తాను అని, అలాగే (ఆ ప్రత్యేక సమయాన) ఆలస్యం చేయకుండా తనను అడుగమని, తాను వారు కోరిన దానిని ప్రసాదిస్తాను అని, ఇంకా తన పాపాలను క్షమించమని (ఆ ప్రత్యేక సమయాన) తనకు మొరపెట్టుకోమని, తాను విశ్వాసులైన తన దాసులను క్షమిస్తానని.فوائد الحديث
ఇందులో రాత్రి చివరి మూడవ భాగము యొక్క ఘనత, ఆ భాగములో (ఆ ప్రత్యేక సమయములో) ఆచరించు నమాజులు, అందులో చేయు దుఆలు, క్షమాభిక్షకై చేసుకునే వేడుకోళ్ళ ఘనత మరియు ప్రత్యేకత తెలుస్తున్నది.
ఈ హదీసును విన్న వ్యక్తి ఆ ప్రత్యేక సమయాల ఘనతను గమనించి, ఆ సమయాలలో తన దుఆల స్వీకరణ కొరకు, వీలైనంత ఎక్కువగా ఆ సమయాల లాభం పొందే ప్రయత్నం చేయాలి.
التصنيفات
తౌహీదె అస్మా వ సిఫాత్