“ఆదం కుమారుడు నాపట్ల అసత్యం పలుకుతున్నాడు, అలా చేయడానికి అతనికి ఏ హక్కూ లేదు; మరియు అతడు నన్ను అవమాన…

“ఆదం కుమారుడు నాపట్ల అసత్యం పలుకుతున్నాడు, అలా చేయడానికి అతనికి ఏ హక్కూ లేదు; మరియు అతడు నన్ను అవమాన పరుస్తున్నాడు, అలా చేయడానికి అతనికి ఏ హక్కూ లేదు

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అల్లాహ్ ఇలా పలికినాడు: “ఆదం కుమారుడు నాపట్ల అసత్యం పలుకుతున్నాడు, అలా చేయడానికి అతనికి ఏ హక్కూ లేదు; మరియు అతడు నన్ను అవమాన పరుస్తున్నాడు, అలా చేయడానికి అతనికి ఏ హక్కూ లేదు. నా పట్ల అతడు అసత్యం పలకడం ఏమిటంటే – “చనిపోయిన తరువాత (పునరుత్థాన దినమున) నన్ను తిరిగి సజీవుడిని చేయలేడు” అని అతడు అనడం. నిజానికి మొట్టమొదటి సారి అతడిని సృష్టించడం కంటే; అతడిని పునరుజీవింపజేయడం కష్టమైనదేమీ కాదు. నన్ను అతడు అవమాన పరచడం ఏమిటంటే – అతడు “అల్లాహ్ ఒక కుమారుడిని కలిగి ఉన్నాడు” అని అనడం, వాస్తవానికి నేను నేనే, ఏకైకుడను, ఎవరి అక్కరా లేని వాడను, నాకు సంతానము లేదు (నాకు ఎవరూ సంతానం కాదు), మరియు నేను ఎవరి సంతానమూ కాదు, మరియు (సర్వలోకాలలో) నన్ను పోలినది ఏదీ లేదు.”

[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథ్ అల్ ఖుద్సీలో – అల్లాహ్ అవిశ్వాసులూ మరియు బహుదైవారాధకులను గురించి తెలిపినాడు, వారు తనపట్ల అసత్యాలు పలుకుతున్నారని, తనకు బలహీనతలు, లోపాలు, కొరతలు ఆపాదిస్తున్నారని తెలియజేసినాడని; వారు అలా అనడానికి వారికి ఏ హక్కూ లేదు – అని అల్లాహ్ తెలియజేసినాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలికినారు. అల్లాహ్’ను గురించి వారి అబద్ధాల విషయానికొస్తే: అల్లాహ్ వారిని శూన్యం నుండి మొదటిసారి సృష్టించినట్లు వారి మరణానంతరం వారిని తిరిగి తీసుకురాలేడని వారి వాదన. వారి వాదనను అల్లాహ్ వారిపై తిప్పి కొట్టినాడు. ఆయన ఇలా సమాధానమిచ్చాడు: శూన్యం నుండి సృష్టిని ప్రారంభించినవాడు వారిని తిరిగి తీసుకు రాగలడు, అది ఆయనకు మరింత సులభం. సృష్టి మరియు పునరుత్థానం రెండూ అల్లాహ్ కు సమానమైనవే. అల్లాహ్ అన్ని విషయాలపై అధికారం కలవాడు. అల్లాహ్’ను అవమానించే విషయానికొస్తే: వారి మాటలు: ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు అని అనడం. వాటిని ఆయన వారిపై త్రిప్పి కొట్టినాడు; నిశ్చయంగా తాను ఒకే ఒక్కడు, ఏకైకుడు, అద్వితీయుడు, ప్రతివిషయానికి సంబంధించి పరిపూర్ణమైనవాడు, అంటే ఉదాహరణకు ఆయన నామముములలో, ఆయన గుణ విషేశాలలో, ఆయన చర్యలలో అన్నింటిలో ఆయన పరిపోర్ణమైనవాడు, ఎటువంటి లోపమూ లేనివాడు, ఏటువంటి కొరతా లేనివాడు, లోపాలకూ, కొరతలకూ అతీతుడు, స్వయం సమృధ్ధుడు, ఆయన ఎవరి అవసరమూ లేనివాడు; కానీ ఆయన అవసరం ప్రతివారికీ ఉంది. ఆయన ఎవరి తండ్రీ కాదు, ఆయన ఎవరి సంతానమూ కాదు. సర్వలోకాలలో ఆయనను పోలినది ఏదీ లేదు. పరమపవిత్రుడూ, సర్వోన్నతుడు.

فوائد الحديث

ఈ హదీసు ద్వారా అల్లాహ్ యొక్క శక్తి, అధికారముల పరిపూర్ణత తెలియుచున్నది.

అలాగే ఇందులో పునరుత్థానము ఉంది అన్న విషయము ఋజువు అవుతున్నది.

అలాగే ఇందులో పునరుత్థానమును నిరాకరించేవాడు లేదా అల్లాహ్ ఒక కుమారుడిని కలిగి ఉన్నాడని విశ్వసించే వాడు అవిశ్వాసి అని ఋజువు అవుతున్నది.

అల్లాహ్ కు ఎవరూ సమానులు కానీ, ఆయనకు భాగస్వాములు గానీ ఎవరూ లేరు.

ఇందులో, అవిశ్వాసులు, బహుదైవారాధకులు పశ్చాత్తాప పడుటకు, తన వైపునకు తిరిగి వచ్చుటకు, వారికి గడువు ప్రసాదించుటలో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క అసమానమూ, అచంచలమైన సహనం కనిపిస్తున్నవి.

التصنيفات

తౌహీదె అస్మా వ సిఫాత్