“అఊదుబిల్లాహిల్ అజీం, వబి వజ్’హి హిల్ కరీం; వ సుల్తానిల్ ఖదీమ్; మినష్’షైతానిర్రజీమ్”

“అఊదుబిల్లాహిల్ అజీం, వబి వజ్’హి హిల్ కరీం; వ సుల్తానిల్ ఖదీమ్; మినష్’షైతానిర్రజీమ్”

అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ బిన్ అల్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం : “మస్జిదులోనికి ప్రవేశించునపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు “అఊదుబిల్లాహిల్ అజీం, వబి వజ్’హి హిల్ కరీం; వ సుల్తానిల్ ఖదీమ్; మినష్’షైతానిర్రజీమ్” (నేను అల్లాహ్ యొక్క కరుణాపూరితమైన వర్చస్సు ద్వారా; (సర్వసృష్టిపై) ఆయన శాశ్వతమైన ఆధిపత్యము ద్వారా; శపించబడిన షైతాను బారి నుండి మహిమాన్వితుడైన అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాను)”. అది విని అక్కడ ఉన్న అతను “అంతేనా?” అన్నాడు. దానికి నేను “అవును” అన్నాను. అపుడు అతడు ఇలా అన్నాడు “ఆ పదాలు పలికినపుడు షైతాను ఇలా అంటాడు “ఇతడు రోజంతా నా నుండి రక్షించబడినాడు.”

[ప్రామాణికమైనది] [దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదులోని ప్రవేశించునపుడు ఇలా పలికేవారు: “అఊదుబిల్లాహిల్ అజీమ్” (నేను సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ యొక్క శరణు కోరుతున్నాను) అంటే “నేను అల్లాహ్ యొక్క గుణవిశేషణాల ద్వారా ఆయన రక్షణ, ఆశ్రయం మరియు శరణు కోరుకుంటున్నాను” అని అర్థం. “వబి వజ్’హి హిల్ కరీం” (మరియు ఆయన యొక్క కరుణాపూరితమైన ముఖ వర్చస్సు ద్వారా) అంటే అల్లాహ్ సర్వశక్తిమంతుడు, ఆయన ఉదారంగా, సమృద్ధిగా ఇచ్చేవాడు అని అర్థం. (మరియు ఆయన అధికారం) అంటే - ఆయన సృష్టిలో ఆయన కోరుకున్న వారిపై ఆధిపత్యం మరియు శక్తి గలవాడు అని అర్థం. (అల్ ఖదీమ్) – అంటే ఆయనే సర్వ ప్రాచీనుడు; ఆయనే సర్వ శాశ్వతుడు అని అర్థం. (మినష్’షైతానిర్రజీం - శపించబడిన షైతాను నుండి) అంటే అల్లాహ్ యొక్క కరుణ నుండి, ఆయన యొక్క దయ నుండి బహిష్కరించబడిన వాడైన షైతాను అని అర్థం. అంటే దాని అర్థం: ఓ అల్లాహ్! అతని గుసగుసల నుండి, అతని ప్రలోభాల నుండి, అతని అడుగుల నుండి, అతని ప్రమాదాల నుండి, అతని సూచనలు మరియు అతని తప్పుదోవ నుండి నన్ను రక్షించు, ఎందుకంటే అతడు అపమార్గాన్ని పట్టించేవాడు మరియు అతడు అపమార్గానికీ, అజ్ఞానానికి ప్రేరేపకుడు. అక్కడ ఉన్నవారిలో ఒకతను అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ బిన్ అల్ ఆస్ రదియల్లాహు అన్హు తో ఇలా అన్నాడు: “అంతేనా?” అని. అంటే “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంతే అన్నారా?” అని అన్నాడని అర్థం. దానికి అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు “అవును” అని జవాబిచ్చారు. కనుక మస్జిదులో ప్రవేశించు వ్యక్తి ఈ దుఆ (ప్రార్థన) చేసినప్పుడు, షైతాను ఇలా అంటాడు, “ఈ ప్రవేశించిన వ్యక్తి తనను తాను అన్ని సమయాలలో - పగలు మరియు రాత్రి – తనను తాను నా నుండి రక్షించుకున్నాడు” అని.

فوائد الحديث

ఈ హదీథు ద్వారా ఈ పదాలతో దుఆ చేయుట యొక్క ఘనత మరియు ఈ దుఆ ఆ వ్యక్తిని షైతాను బారి నుండి మిగతా దినమంతా రక్షిస్తుందని తెలుస్తున్నది.

అలాగే ఇందులో షైతాను గురించి హెచ్చరిక ఉన్నది – అతడు ఒక ముస్లిం కొరకు అతణ్ణి అపమార్గం పట్టించడానికి, అతణ్ణి ప్రేరేపించడానికి అన్ని వేళలా కాపుకాచుకుని ఉంటాడని హెచ్చరించబడుచున్నది.

ఒక వ్యక్తి తన హృదయంలో అల్లాహ్’పై ఉన్న విశ్వాసం మరియు ఈ దుఆ పట్ల అతని అవగాహన మరియు దాని ఫలితంగా అల్లాహ్ యొక్క వాగ్దానంపై అతని విశ్వాసం – వీటన్నిటి ఆధారంగా షైతాను యొక్క తప్పు దారి నుండి మరియు అతడి విచలనం నుండి రక్షించబడతాడు.

التصنيفات

తౌహీదె అస్మా వ సిఫాత్, మస్జిదులో ప్రవేశించేటప్పుడు మరియు బయటకు వచ్చేటప్పడు పఠించు దుఆలు