మస్జిదులో ప్రవేశించేటప్పుడు మరియు బయటకు వచ్చేటప్పడు పఠించు దుఆలు

మస్జిదులో ప్రవేశించేటప్పుడు మరియు బయటకు వచ్చేటప్పడు పఠించు దుఆలు

1- “మస్జిదులోనికి ప్రవేశించునపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు@ “అఊదుబిల్లాహిల్ అజీం, వబి వజ్’హి హిల్ కరీం; వ సుల్తానిల్ ఖదీమ్; మినష్’షైతానిర్రజీమ్”* (నేను అల్లాహ్ యొక్క కరుణాపూరితమైన వర్చస్సు ద్వారా; (సర్వసృష్టిపై) ఆయన శాశ్వతమైన ఆధిపత్యము ద్వారా; శపించబడిన షైతాను బారి నుండి మహిమాన్వితుడైన అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాను)”. అది విని అక్కడ ఉన్న అతను “అంతేనా?” అన్నాడు. దానికి నేను “అవును” అన్నాను. అపుడు అతడు ఇలా అన్నాడు “ఆ పదాలు పలికినపుడు షైతాను ఇలా అంటాడు “ఇతడు రోజంతా నా నుండి రక్షించబడినాడు.”

2- “ఎప్పుడైనా, మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక” (ఓ అల్లాహ్! నా కొరకు నీ కరుణాకటాక్షముల ద్వారములను తెరువుము); అలాగే మస్జిదు నుండి బయటకు వెళ్ళునపుడు అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మ! ఇన్నీ అస్అలుక మిన్ ఫద్’లిక” (ఓ అల్లాహ్! నేను నీ శుభాలలో నుండి నా కొరకు ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను).”