“మీలో ఎవ్వరితోనూ అల్లాహ్ మాట్లాడకుండా ఉండడు (మీలో ప్రతి ఒక్కరితో అల్లాహ్ మాట్లాడుతాడు); మరియు అతనికీ, అల్లాహ్…

“మీలో ఎవ్వరితోనూ అల్లాహ్ మాట్లాడకుండా ఉండడు (మీలో ప్రతి ఒక్కరితో అల్లాహ్ మాట్లాడుతాడు); మరియు అతనికీ, అల్లాహ్ కు మధ్య అనువాదకుడు కూడా ఉండడు

అదీ ఇబ్న్ హాతిం (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవ్వరితోనూ అల్లాహ్ మాట్లాడకుండా ఉండడు (మీలో ప్రతి ఒక్కరితో అల్లాహ్ మాట్లాడుతాడు); మరియు అతనికీ, అల్లాహ్ కు మధ్య అనువాదకుడు కూడా ఉండడు. అతడు తన కుడివైపు చూస్తాడు అక్కడ అతడు తాను ముందుకు పంపిన దానిని తప్ప (తన ఆచరణలను తప్ప) మరేమీ చూడడు, మరియు అతడు తన ఎడమవైపు చూస్తాడు, అక్కడ అతడు ముందుకు పంపిన దానిని తప్ప (తన ఆచరణలను తప్ప) మరేమీ చూడడు. మరియు అతను తన ముందు వైపునకు చూస్తాడు; అతనికి ఎదురుగా నరకాగ్ని తప్ప మరేమీ కనిపించదు. కనుక నరకాగ్ని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి – అది ఖర్జూరములో సగభాగముతోనైనా సరే.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఇలా తెలియజేస్తున్నారు. ప్రతి విశ్వాసి తీర్పు దినమున ఏకంగా అల్లాహ్ ఎదురుగా నిలబడతాడు, మరియు అల్లాహ్ అతనితో మధ్యవర్తి లేకుండా మాట్లాడతాడు మరియు పదాలను అనువదించడానికి వారి మధ్య అనువాదకుడు కూడా ఉండడు. కనుక అతడు తీవ్రమైన భయంతో తన ముందు ఉన్న నరకాగ్ని నుండి రక్షణ పొందటానికి మార్గము ఏమైనా దొరుకుతుందేమో అనే ఆశతో కుడి వైపునకు మరియు ఎడమ వైపునకు చూస్తాడు. అతడు తన కుడివైపుకు చూసినపుడు, అతనికి తాను చేసిన మంచి పనులు తప్ప మరేమీ కనిపించవు. అతడు తన ఎడమవైపుకు చూసినపుడు, అతనికి తాను చేసిన చెడు పనులు తప్ప మరేమీ కనిపించవు. తన ఎదురుగా చూసినపుడు, అతనికి నరకాగ్ని తప్ప మరేమీ కనిపించదు, అతడు దాని నుండి తప్పించుకోలేడు ఎందుకంటే అతడు దానిపై ఉన్న ఒక వంతెనను (పుల్ సిరాత్ ను) దాటవలసి ఉంటుంది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మీకు మరియు నరకాగ్నికి మధ్య దాతృత్వం మరియు సత్కార్యాల కవచాన్ని ఉంచండి, అది సగం ఖర్జూరం అంత చిన్నది అయినా సరే.

فوائد الحديث

ఈ హదీథులో ఎంత చిన్నదైనా సరే దానధర్మాలు చేయుట పట్ల ప్రోత్సాహం - మంచి లక్షణాలను అలవర్చుకోవడం, ఇతరుల పట్ల దయతో మెలగడం, మృదువుగా మాట్లాడటం పట్ల హితబోధ ఉన్నది.

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పునరుత్థానం రోజున తన సేవకుడికి అతి చేరువగా ఉంటాడు, ఎందుకంటే వారి మధ్య ఏ పరదా ఉండదు, వారి మధ్య, మధ్యవర్తి గానీ మరియు వ్యాఖ్యాత గానీ ఎవరూ ఉండరు, కాబట్టి విశ్వాసి తన ప్రభువు ఆజ్ఞను ధిక్కరించకుండా జాగ్రత్తపడాలి.

ఒక వ్యక్తి తాను ఇచ్చే దానం, అది ఎంత చిన్నదైనా సరే, దానిని అల్పమైనదిగా భావించరాదు. ఎందుకంటే, అది నరకాగ్ని నుండి అతనికి రక్షణగా ఉంటుంది.

التصنيفات

తౌహీదె అస్మా వ సిఫాత్, నఫిల్ దానాలు