నఫిల్ దానాలు

నఫిల్ దానాలు

4- “మీలో ఎవ్వరితోనూ అల్లాహ్ మాట్లాడకుండా ఉండడు (మీలో ప్రతి ఒక్కరితో అల్లాహ్ మాట్లాడుతాడు); మరియు అతనికీ, అల్లాహ్ కు మధ్య అనువాదకుడు కూడా ఉండడు*. అతడు తన కుడివైపు చూస్తాడు అక్కడ అతడు తాను ముందుకు పంపిన దానిని తప్ప (తన ఆచరణలను తప్ప) మరేమీ చూడడు, మరియు అతడు తన ఎడమవైపు చూస్తాడు, అక్కడ అతడు ముందుకు పంపిన దానిని తప్ప (తన ఆచరణలను తప్ప) మరేమీ చూడడు. మరియు అతను తన ముందు వైపునకు చూస్తాడు; అతనికి ఎదురుగా నరకాగ్ని తప్ప మరేమీ కనిపించదు. కనుక నరకాగ్ని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి – అది ఖర్జూరములో సగభాగముతోనైనా సరే.