“దానము చేయుట సంపదను తగ్గించదు. ఇతరులను క్షమించే గుణం కారణంగా అల్లాహ్ దాసుని గౌరవాన్ని పెంపొందింప జేస్తాడు…

“దానము చేయుట సంపదను తగ్గించదు. ఇతరులను క్షమించే గుణం కారణంగా అల్లాహ్ దాసుని గౌరవాన్ని పెంపొందింప జేస్తాడు మరియు ఎవరైతే కేవలం అల్లాహ్ కొరకు అణకువ, వినయం అలవర్చుకుంటాడో, అల్లాహ్ అతడి స్థానాన్ని ఉన్నతం చేస్తాడు”

అబీ హురైరాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “దానము చేయుట సంపదను తగ్గించదు. ఇతరులను క్షమించే గుణం కారణంగా అల్లాహ్ దాసుని గౌరవాన్ని పెంపొందింప జేస్తాడు మరియు ఎవరైతే కేవలం అల్లాహ్ కొరకు అణకువ, వినయం అలవర్చుకుంటాడో, అల్లాహ్ అతడి స్థానాన్ని ఉన్నతం చేస్తాడు”.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానము చేయుట సంపదను తగ్గించదు అని తెలియజేస్తున్నారు. దానము సంపదను, దాని (వలన కలిగే) కీడు, చెడుల నుండి కాపాడుతుంది. చేసిన దానానికి బదులుగా అల్లాహ్ ఆ సంపద యొక్క యజమానికి గొప్ప శుభాలను ప్రసాదిస్తాడు. ఆ విధంగా అది అతని సంపన్నతలో వృద్ధియే గానీ తగ్గింపు కాదు. క్షమాగుణం అంటే ప్రతీకారం తీర్చుకునే శక్తి లేదా శిక్షించే సామర్థ్యము కలిగి ఉండీ కూడా క్షమించడం – అది అతడిని ఇంకా బలవంతుడిని చేస్తుంది మరియు అతని గౌరవాన్ని ఇనుమడింప జేస్తుంది. ఎవరికో భయపడి లేదా ఎవరో కోరినారని ఎవరూ అల్లాహ్ ఎదుట అణకువ, వినయం అలవర్చుకోరు లేదా అల్లాహ్ ఎదుట అవమానం పాలు కారు లేదా అతడి నుండి ఏదైనా ఆశించి ఈ పనులు చేయరు. అల్లాహ్ కొరకు అణకువ, వినయం అలవర్చుకొనుట కేవలం అల్లాహ్ తన స్థానాన్ని ఉన్నతం చేయుట కొరకు మరియు అల్లాహ్ తనకు గౌరవం ప్రసాదించుట కొరకు మాత్రమే కావాలి.

فوائد الحديث

శుభము మరియు సమృద్ధి అనేవి షరియత్ ను అనుసరించుటలో మరియు మంచి చేయుటలో ఉన్నాయి, కొంత మంది దీనికి వ్యతిరేకంగా అభిప్రాయం కలిగి ఉన్నప్పటికీ.

التصنيفات

నఫిల్ దానాలు