إعدادات العرض
. . .
. . .
అబూ దర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కొంతమంది సహాబాలు ఇలా అన్నారు: "ఓ ప్రవక్తా! ధనవంతులు ఎన్నో పుణ్యాలు సంపాదించేస్తున్నారు. వారు కూడా మేము చేస్తున్నట్లుగానే నమాజ్ చేస్తారు, మేము ఉన్నట్లుగానే ఉపవాసం ఉంటారు, కానీ (మేము చేయలేని విధంగా) తమ అదనపు ధనాన్ని దానం కూడా చేస్తారు." అప్పుడు ప్రవక్త ఇలా పలికినారు: "అల్లాహ్ మీకు కూడా అలా దానం చేసే అవకాశం ఇవ్వలేదు అని భావిస్తున్నారా? ప్రతిసారి 'సుబహానల్లాహ్' (అల్లాహ్ పరమ పవిత్రుడు) అని ధ్యానం చేయడమూ దానమే, ప్రతిసారి 'అల్లాహు అక్బర్' (అల్లాహ్ గొప్పవాడు) అని పలకడమూ దానమే, ప్రతిసారి 'అల్‌హమ్దులిల్లాహ్' (అల్లాహ్‌కే సకల స్తుతులు) అని పలకడమూ దానమే, ప్రతిసారి 'లా ఇలాహ ఇల్లల్లాహ్' (అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు) అని పలకడమూ దానమే. మంచి పనిని ప్రోత్సహించడమూ దానమే, చెడు పనిని నిషేధించడము కూడా దానమే. ఇంతేకాదు, మీలో ఎవరు తమ శారీరక కోరికను హలాల్ మార్గంలో తీరుస్తారో, వారికి దాని పుణ్యమూ లభిస్తుంది." అప్పుడు సహాబాలు ఆశ్చర్యపడి, "ఓ రసూలుల్లాహ్! మాలో ఎవరు తమ కోరికను తీర్చుకున్నా అతనికి కూడా పుణ్యం లభిస్తుందా?" అని అడిగారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు: "అతడు అదే కోరికను హరామ్ మార్గంలో తీర్చుకుంటే అతడు పాపం చేసినట్లుగా లెక్కించబడతాడని మీకు తెలియదా? అలాగే, హలాల్ మార్గంలో తన కోరిక తీర్చుకుంటే అతనికి పుణ్యం లభిస్తుంది."
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Hausa Kurdî Português සිංහල Kiswahili Tiếng Việt অসমীয়া ગુજરાતી Nederlands മലയാളം Română Magyar ქართული ಕನ್ನಡ Moore Svenska Македонски ไทย Українськаالشرح
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులలోని కొంతమంది పేదవారు ఆయన దగ్గరకు వచ్చి ఇలా అన్నారు: ‘‘ఓ అల్లాహ్ ప్రవక్తా! ధనవంతులు అన్ని పుణ్యాలూ సంపాదించేసు కుంటున్నారు. వారు మేము చేసేలా నమాజ్ చేస్తారు, మేము ఉండేలా ఉపవాసం ఉంటారు, కానీ వారు తమ అదనపు ధనాన్ని దానం కూడా చేస్తారు, కానీ మేము మాత్రం (బీదరికం వలన) దానం చేయలేము!’’ అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇలా ఉత్సాహపరిచారు: ‘‘అల్లాహ్ మీకు కూడా దానం చేసే అవకాశాన్ని ఇవ్వలేదు అని అనుకుంటున్నారా? ప్రతిసారి ‘‘సుబహానల్లాహ్’’ (అల్లాహ్ పరమ పవిత్రుడు) అనడం దానం, ప్రతిసారి ‘‘అల్లాహు అక్బర్’’ (అల్లాహ్ గొప్పవాడు) అనడం దానం, ప్రతిసారి ‘‘అల్ హమ్దులిల్లాహ్’’ (అల్లాహ్‌కే సకల స్తుతులు) అనడం దానం, ప్రతిసారి ‘‘లా ఇలాహ ఇల్లల్లాహ్’’ (అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు) అనడం దానం. మంచి పనిని ప్రోత్సహించడం దానం, చెడు పనిని నిషేధించడం కూడా దానం. మీలో ఎవరైనా తన భార్యతో తన కోరిక తీర్చుకుంటే, దానికీ పుణ్యం లభిస్తుంది.’’ దానికి వారు ఆశ్చర్యపడి, ‘‘ఓ రసూలుల్లాహ్! మాలో ఎవరైనా తమ కోరికను తీర్చుకున్నా అతనికి కూడా పుణ్యం లభిస్తుందా?’’ అని అడిగారు. దానికి ప్రవక్త ఇలా సమాధానమిచ్చారు: ‘‘అతడు అదే కోరికను హరామ్ మార్గంలో తీర్చుకుంటే అతనికి పాపం చుట్టుకుంటుందని మీకు తెలియదా? అలాగే, హలాల్ మార్గంలో తన కోరిక తీర్చుకుంటే, అతనికి పుణ్యం లభిస్తుంది.’’فوائد الحديث
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు (సహాబాలు) మంచి పనుల్లో ఒకరితో ఒకరు పోటీ పడి, అల్లాహ్ వద్ద గొప్ప ప్రతిఫలం, దయ పొందేందుకు ఎంతో ఉత్సాహంగా ఉండేవారు.
ఇస్లామ్‌లో మంచి పనుల అవకాశాలు చాలా విస్తృతంగా ఉంటాయి. ప్రతి ముస్లిం మంచి ఉద్దేశంతో, సత్కార్య లక్ష్యంతో చేసే ప్రతి పని—అది చిన్నదైనా, పెద్దదైనా — అల్లాహ్ దృష్టిలో పుణ్యంగా లెక్కించబడుతుంది.
ఇస్లాం ధర్మం చాలా సులభమైనది, అందరూ అనుసరించ దగినది. ప్రతి ముస్లిం, అతని సామర్థ్యం, పరిస్థితి, స్థితి ఏదైనా కావచ్చు — అల్లాహ్ ఆజ్ఞలకు లోబడి ఉండేందుకు ఏదో ఒక మంచి పని చేయడం సాధ్యమే.
ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ఇలా చెప్పారు: ఈ హదీథు ఆధారంగా, అనుమతించబడిన పనులు కూడా నిజమైన నియతు (ఉద్దేశం) వలన అల్లాహ్‌కు విధేయతగా మారుతాయి. ఉదాహరణకు, తన భార్యతో తన కోరిక తీర్చుకోవడం కూడా ఆరాధనగా మారుతుంది — ఒకవేళ ఆ వ్యక్తి ఉద్దేశం ఇలా ఉంటే: భార్య హక్కులను నెరవేర్చడం, అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం ఆమెతో స్నేహంగా, ప్రేమగా ఉండడం, మంచి సంతానం కోసం ప్రయత్నించడం, తాను లేదా భార్య హరామ్ దృష్టి లేదా హరామ్ ఆలోచనలకు దూరంగా ఉండటం, లేదా ఏదైనా ఇతర మంచి ఉద్దేశంతో చేస్తే — అది కూడా పుణ్యమైన ఆరాధనగా (ఇబాదత్) లెక్కించబడుతుంది.
ఉదాహరణలు ఇవ్వడం, ఉపమానాలు ఉపయోగించడం వలన తాను చెప్పే విషయం స్పష్టంగా, శ్రోతపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది.