జిక్ర్ ప్రాముఖ్యతలు

జిక్ర్ ప్రాముఖ్యతలు

3- “ఎవరైతే పది సార్లు ‘లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హందు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్’ (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, ఆయన ఏకైకుడు, ఆయనకు సాటి ఎవరూ లేరు, ఈ సృష్టి సామ్రాజ్యమంతా ఆయనకు చెందినదే, సకల స్త్రోత్రములూ ఆయనకు మాత్రమే చెందినవి, మరియు ఆయన ప్రతి విషయము పై అధికారము కలవాడు)* అని ఉచ్ఛరిస్తాడో, అతడు ఇస్మాయీల్ అలైహిస్సలాం సంతతి నుండి నలుగురు బానిసలను విముక్తి కలిగించిన వానితో సమానము”.

4- “ముఅజ్జిన్ (మస్జిద్ లో అజాన్ పలుకు వ్యక్తి) “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలికినపుడు మీలో ఎవరైతే “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలుకుతాడో*, తరువాత అతడు “అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్” అని పలికినపుడు, “అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “అష్’హదు అన్న ముహమ్మదుర్’రసూలుల్లాహ్” అని పలికినపుడు, “అష్’హదు అన్న ముహమ్మదుర్’రసూలుల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “హయ్య అలస్సలాహ్” అని పలికినపుడు, “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “హయ్య అలల్’ఫలాహ్” అని పలికినపుడు, “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలికినపుడు, “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలుకుతాడో, తరువాత (చివరికి) అతడు (ముఅజ్జిన్) “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని పలికినపుడు, (మీలో ఎవరైతే) “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని హృదయపూర్వకంగా పలుకుతాడో అతడు స్వర్గములో ప్రవేశిస్తాడు.”

5- “వాస్తవానికి (ఒకసారి) రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో కొంతమంది, వృత్తాకారంలో కూర్చుని ఉండగా వారి వద్దకు వెళ్ళి “ఏ విషయం మిమ్మల్ని ఇక్కడ ఇలా కూర్చునేలా చేసింది?” అని ప్రశ్నించారు. దానికి వారు ఇలా అన్నారు “మమ్మల్ని ఇస్లాం వైపు నడిపించినందుకు, మాపై తన అనుగ్రహాలను కురిపించినందుకు అల్లాహ్ ను స్మరించడానికి, ఆయనను స్తుతించడానికి మేము ఇక్కడ కూర్చున్నాం”. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ సాక్షిగా చెప్పండి దాని కొరకు తప్ప (మరింక దేనికొరకూ) కూర్చోలేదా మీరు?” అన్నారు. అందుకు వారు “అల్లాహ్ సాక్షిగా దానికొరకు తప్ప (మరింక దేనికొరకూ) కూర్చో లేదు మేము” అన్నారు. అపుడు ఆయన వారితో @“వాస్తవానికి మిమ్ములను నిందించడానికి ప్రమాణం చేయమని అనలేదు; కానీ జీబ్రయీల్ అలైహిస్సలాం నా వద్దకు వచ్చారు, దైవదూతల ముందు అల్లాహ్ మిమ్మల్ని గురించి గర్విస్తున్నాడు” అని తెలియజేశారు.”

6- “మీ ఆచరణలలో ఉత్తమమైన దాని గురించి నేను మీకు తెలుపనా? అవి మీ ప్రభువు వద్ద పరిశుద్ధమైనది; అది మీ స్థానములను ఉన్నతము చేయునటువంటిది*; (అల్లాహ్ మార్గములో) బంగారము మరియు వెండి ఖర్చుచేయుట కంటే ఉత్తమమైనది; మరియు మీరు మీ శత్రువులను ఎదుర్కొన్నపుడు వారి మెడలపై మీరు దాడి చేయడం, మరియు వారు మీ మెడలపై దాడి చేయడం కంటే కూడా ఇది మీకు శ్రేష్ఠమైనది”; దానికి వారు “తప్పకుండా తెలియజేయండి ఓ ప్రవక్తా!” అన్నారు. అపుడు ఆయన “సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క స్మరణ చేయుట (ఆయనను స్మరించుట, జిక్ర్ చేయుట)” అన్నారు.

7- “ఒకసారి, రసూలుల్లాల్ సల్లల్లాహు అలైహి వసల్లం తో మక్కా నగరానికి వెళ్ళే దారిపై ప్రయాణిస్తుండగా, ‘జుమ్’దాన్’ అని పిలవబడే ఒక పర్వతం ప్రక్క నుండి వెళ్ళడం జరిగింది. అపుడు ఆయన ఇలా అన్నారు: “కదలండి ముందుకు, ఇది ‘జుమ్’దాన్’ (పర్వతం); @‘ముఫర్రిదూన్’లు దీనిని అధిగమించినారు*”. ఆయన వెంట ఉన్న వారు “ముఫర్రిదూన్ అంటే ఎవరు ఓ రసూలల్లాహ్?” అని ప్రశ్నించారు. దానికి ఆయన: “అల్లాహ్’ను అధికంగా స్మరించే పురుషులు, మరియు అల్లాహ్’ను అధికంగా స్మరించే స్త్రీలు” అన్నారు.

11- “ముఅజ్జిన్ అజాన్ పలుకుతున్నపుడు మీరు విన్నట్లయితే, అతను పలుకునట్లుగానే మీరూ పలకండి, తరువాత నాపై శాంతి మరియు శుభాలకొరకు ప్రార్థించండి (దరూద్ పఠించండి)* ఎవరైతే నాపై ఒకసారి దరూద్ పఠిస్తాడో, అల్లాహ్ దానికి పది రెట్లు ఎక్కువగా అతనిపై శాంతి, శుభాలు కురిపిస్తాడు. తరువాత నాకు ‘అల్-వసీలహ్’ ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకొనండి. అది (అల్-వసీలహ్) స్వర్గములో ఒక సమున్నతమైన స్థానము. అది కేవలం ఒకరికి మాత్రమే ప్రసాదించబడుతుంది. ఆ ఒక్కరు నేనే కావాలని నా ఆశ. ఎవరైతే నా కొరకు వసీల ప్రసాదించమని ప్రార్థిస్తాడో, (తీర్పు దినము నాడు) అతని కొరకు (అల్లాహ్ వద్ద) సిఫారసు చేయడం నాపై విధి అవుతుంది.”