“ఎవరైతే ‘సుబ్’హానల్లాహి వ బిహందిహి’ (అల్లాహ్ సకల లోపాలకు, కొరతలకు అతీతుడు, మరియు సకల స్తోత్రములు ఆయన కొరకే) అని…

“ఎవరైతే ‘సుబ్’హానల్లాహి వ బిహందిహి’ (అల్లాహ్ సకల లోపాలకు, కొరతలకు అతీతుడు, మరియు సకల స్తోత్రములు ఆయన కొరకే) అని వంద సార్లు ఉచ్ఛరిస్తాడో, అతని పాపాలు అతని నుండి దించి వేయబడతాయి (తుడిచి వేయబడతాయి) అవి సముద్రపు నురగ అంత ఎక్కువగా ఉన్నప్పటికీ”

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు నేరుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి, వారు ఇలా పలికారని ఉల్లేఖిస్తున్నారు: “ఎవరైతే ‘సుబ్’హానల్లాహి వ బిహందిహి’ (అల్లాహ్ సకల లోపాలకు, కొరతలకు అతీతుడు, మరియు సకల స్తోత్రములు ఆయన కొరకే) అని వంద సార్లు ఉచ్ఛరిస్తాడో, అతని పాపాలు అతని నుండి దించి వేయబడతాయి (తుడిచి వేయబడతాయి) అవి సముద్రపు నురగ అంత ఎక్కువగా ఉన్నప్పటికీ”.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఎవరైతే ‘సుబ్’హానల్లాహి వ బిహందిహి’ (అల్లాహ్ సకల లోపాలకూ, కొరతలకు అతీతుడు, మరియు సకల స్తోత్రములు ఆయనకే శోభిస్తాయి) అని వంద సార్లు ఉచ్ఛరిస్తాడో, అతని పాపాలు క్షమించి వేయబడతాయి, మరియు తుడిచి వేయబడతాయి, అవి సముద్రపు అలలు తీరాన్ని బలంగా తాకినపుడు ఏర్పడే నురగ కంటే కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ.

فوائد الحديث

ఈ ప్రతిఫలం (పారితోషికం) ఎవరైతే, క్రమం తప్పకుండా ఉచ్ఛరిస్తాడో, లేక ప్రతిరోజూ ఉచ్ఛరిస్తాడో అతనికి దొరుకుతుంది.

తస్బీహ్ (సుబ్’హానల్లాహ్): అంటే అల్లాహ్ ఎటువంటి అసంపూర్ణత, కొరత మరియు లోపమూ లేనివాడు, పవి త్రుడు, పరిశుద్ధుడు అని అర్థము.

అల్’హంద్: అల్లాహ్ పై ప్రేమ మరియు భయభక్తులతో ఆయన సంపూర్ణతను, కీర్తిని యశస్సును కొనియాడుట.

ఈ హదీసులో చెప్పబడినట్లు క్షమించ బడేవి, తుడిచి వేయబడేవి చిన్నచిన్న పాపాలు, పెద్దపెద్ద పాపాలు (అల్-కబాయిర్) కాదు. పెద్ద పాపాల కొరకు అల్లాహ్ ముందు పశ్చాత్తాప పడుట తప్పనిసరి.

التصنيفات

జిక్ర్ ప్రాముఖ్యతలు