అల్లాహ్ నామస్మరణంతో (దిక్ర్ తో) నీ నాలుకను తడిగా ఉంచు

అల్లాహ్ నామస్మరణంతో (దిక్ర్ తో) నీ నాలుకను తడిగా ఉంచు

అబ్దుల్లాహ్ ఇబ్న్ బుస్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నాడు: “ఓ రసూలుల్లాహ్! షరియత్ ఆదేశాలు (ఇస్లామీయ ధర్మశాస్త్ర ఆదేశాలు) నాకు చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. కనుక నేను (స్థిరంగా పాటించేలా) పట్టుకుని ఉండేలా నాకు ఏదైనా బోధించండి”. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జనాబిచ్చారు: "అల్లాహ్ నామస్మరణంతో (దిక్ర్ తో) నీ నాలుకను తడిగా ఉంచు."

[దృఢమైనది]

الشرح

ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి తన శారీరక బలహీనత కారణంగా స్వచ్ఛంద ఆరాధనలు ఆచరించుట తనపై భారంగా మారిందని మొర పెట్టుకున్నాడు. తరువాత అతడు తాను అంటి పెట్టుకుని ఉండగలిగేలా, తద్వారా తనకు గొప్ప ప్రతిఫలం లభించేలా తనకు ఏదైనా ఒక తేలిక ఆచరణను బోధించమని అర్థించాడు. కనుక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి అన్ని సమయాలలో, మరియు అన్ని పరిస్థితులలో నిరంతరం సర్వోన్నతుడైన అల్లాహ్ ‘తస్బీహ్’ అంటే - (సుబ్’హానల్లాహ్ – అల్లాహ్ పరమ పవిత్రుడు); ‘తమ్’హీద్’ (అల్’ హందులిల్లాహ్ – స్తోత్రములన్నీ కేవలం అల్లాహ్ కొరకే); ‘ఇస్తిగ్’ఫార్’ (అస్తగ్’ఫిరుల్లాహ్ – ఓ అల్లాహ్ నన్ను క్షమించు); ‘దుఆ’ చేయుట; మరియు మొరపెట్టుకొనుట - ఈ విధంగా అల్లాహ్’ను కీర్తించడం, ప్రశంసించడం; క్షమాపణ కోరడం, ప్రార్థించడం మొదలైన వాటి ద్వారా తన నాలుకను నిరంతరం తాజాగా మరియు చురుకుగా ఉంచుకోమని సలహా ఇచ్చినారు.

فوائد الحديث

ఈ హదీథులో సర్వోన్నతుడైన అల్లాహ్’ను నిరంతరం స్మరించుట యొక్క ఘనత తెలియుచున్నది.

అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహాలలో ఒకటి ఏమిటంటే, ఆయన ప్రతిఫలం పొందే మార్గాలను సులభతరం చేస్తాడు.

దర్మబద్ధత, నైతికత మరియు మంచితనపు ద్వారాల ద్వారా ప్రతిఫలంలో తమ వాటాను పొందుటలో అల్లాహ్ యొక్క దాసులు భిన్నంగా ఉంటారు.

అల్లాహ్’ను నాలుకతో స్తుతించుట, ప్రశంసించుట, ఆయన ఏకత్వాన్ని ప్రకటించుట, ఆయన ఘనతను కొనియాడుట, మొదలైన ఇతర విషయాలతో పాటు హృదయం కూడా పూర్తిగా అందులో లీనమై ఉండడం అనేది అనేక స్వచ్ఛంద ఆరాధనల స్థానాన్ని ఆక్రమిస్తుంది.

ఈ హదీథులో ప్రశ్నలు వేసే వారి పట్ల ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చూపే శ్రద్ధ, ప్రతి ఒక్కరికి అతని స్థితికి తగిన విధంగా సమాధానం ఇవ్వడం చూడవచ్చు.

التصنيفات

జిక్ర్ ప్రాముఖ్యతలు