“ముఅజ్జిన్ (మస్జిద్ లో అజాన్ పలుకు వ్యక్తి) “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలికినపుడు మీలో ఎవరైతే…

“ముఅజ్జిన్ (మస్జిద్ లో అజాన్ పలుకు వ్యక్తి) “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలికినపుడు మీలో ఎవరైతే “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలుకుతాడో

ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ముఅజ్జిన్ (మస్జిద్ లో అజాన్ పలుకు వ్యక్తి) “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలికినపుడు మీలో ఎవరైతే “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలుకుతాడో, తరువాత అతడు “అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్” అని పలికినపుడు, “అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “అష్’హదు అన్న ముహమ్మదుర్’రసూలుల్లాహ్” అని పలికినపుడు, “అష్’హదు అన్న ముహమ్మదుర్’రసూలుల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “హయ్య అలస్సలాహ్” అని పలికినపుడు, “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “హయ్య అలల్’ఫలాహ్” అని పలికినపుడు, “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలికినపుడు, “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలుకుతాడో, తరువాత (చివరికి) అతడు (ముఅజ్జిన్) “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని పలికినపుడు, (మీలో ఎవరైతే) “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని హృదయపూర్వకంగా పలుకుతాడో అతడు స్వర్గములో ప్రవేశిస్తాడు.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

“అజాన్” అంటే అది ప్రజలకు నమాజు సమయము ప్రారంభమైనది అని తెలియ జేయు ప్రకటన. అదాన్ లోని పదాలు, అవి విశ్వాసము (ఈమాన్) మరియు “అఖీదా” ను తెలిపే సమగ్రమైన అర్థాన్ని కలిగి ఉన్న పదాలు (అఖీదహ్: ధర్మము యొక్క మూల విశ్వాసాల సమాహారము). ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అజాన్ వింటున్నపుడు (వింటున్న వ్యక్తిపై) షరియత్ ప్రకారము ఏమి నిర్దేశించబడినదో వివరిస్తున్నారు – అది ఏమిటంటే అదాన్ వింటున్న వ్యక్తి ముఅద్దిన్ ఏమి పలుకుతున్నాడో దానిని పునరావృతం చేయడం (తిరిగి పలకడం). ఉదాహరణకు ముఅజ్జిన్ “అల్లాహు అక్బర్” అని పలికితే వింటున్న వ్యక్తి కూడా “అల్లాహు అక్బర్” అని పలకాలి, ఆ విధంగా అదాన్ చివరి వరకూ అన్నమాట; కేవలం ముఅద్దిన్ “హయ్య అలస్సలాహ్”; “హయ్య అలల్ ఫలాహ్” అని పలికినపుడు తప్ప. అపుడు వింటున్న వ్యక్తి “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని పలుకుతాడు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించినారు – ఎవరైతే ముఅజ్జిన్ తో అతడు పలుకుతున్న పదాలను హృదయపూర్వకంగా పున:ఉచ్ఛరిస్తాడో అతడు స్వర్గములోనికి ప్రవేశిస్తాడు అని. అజాన్ పదాల యొక్క అర్థము: అల్లాహు అక్బర్: అంటే అల్లాహ్ అందరికంటే గొప్పవాడు, ఆయన మహిమ కీర్తిమంతమగుగాక, ఆయన అత్యంత ఘనమైన వాడు, ఆయన ప్రతి దానికన్నా కూడా గొప్పవాడు అని అర్థము. అష్’హదు అన్-లా ఇలాహ ఇల్లల్లాహ్: అంటే “అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు” అని నేను సాక్ష్యమిస్తున్నాను” అని అర్థము. అష్’హదు అన్న ముహమ్మదన్ రసూలుల్లాహ్: అంటే “ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశ హరుడు అనే విషయము, మరియు ఆయన అల్లాహ్ చేత పంపబడినాడు అనే విషయము సత్యము అని నేను హృదయపూర్వకముగా అంగీకరిస్తున్నాను మరియు ఆయనకు విధేయత చూపుట విధి అని నా నాలుకతో పలుకుతున్నాను, మరియు సాక్ష్యమిస్తున్నాను” అని అర్థము. హయ్య అలస్సలాహ్: అంటే “సలాహ్ (నమాజు) వైపునకు రండి” అని అర్థము; దానిని విన్న వ్యక్తి: “లాహౌల వలా ఖువ్వత” అని పలుకుతాడు: అంటే దాని అర్థము: “అల్లాహ్ యొక్క అనుగ్రహం ఉంటే తప్ప, ఒక వ్యక్తి అల్లాహ్ ఆరాధనా మార్గములో ఎదురయ్యే ఆటంకాలను తప్పించుకోలేడు, అతడు అశక్తుడు (అతనికా శక్తి లేదు), ఏ కార్యమునైననూ చేయగల సామర్థ్యము అతనికి లేదు” అని అర్థము. హయ్య అలల్ ఫలాహ్: అంటే “సాఫల్యము వైపునకు, విజయము వైపునకు రండి” అని అర్థము; అంటే స్వర్గములోనికి ప్రవేశించుటలో, మరియు నరకాగ్ని నుండి రక్షణ పొందుటలో విజయుడు కావడం.

فوائد الحديث

“లాహౌల ఇల్లాబిల్లాహ్” అని రెండు చోట్ల ఉచ్ఛరించుట తప్ప, అదాన్ లోని మిగిలిన పదాలను ముఅజ్జిన్ పలికినట్లుగానే తిరిగి ఉచ్ఛరించుట యొక్క ఘనత తెలుస్తున్నది.

التصنيفات

జిక్ర్ ప్రాముఖ్యతలు, జిక్ర్ ప్రాముఖ్యతలు, అజాన్ మరియు ఇఖామత్, అజాన్ మరియు ఇఖామత్