అజాన్ మరియు ఇఖామత్

అజాన్ మరియు ఇఖామత్

3- “ముఅజ్జిన్ ఇచ్చిన అజాన్ విన్నపుడు, ఎవరైతే “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు; రదీతు బిల్లాహి రబ్బన్, వ బి ముహమ్మదిన్ రసూలన్, వ బిల్ ఇస్లామి దీనన్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ఆయనకు సాటిగానీ, భాగస్వామి గానీ ఎవరూ లేరు అని, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను; నేను అల్లాహ్ ను నా ప్రభువుగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరునిగా మరియు ఇస్లాంను ధర్మంగా అంగీకరిస్తున్నాను, మరియు అందుకు సంతోషిస్తున్నాను) అని పలుకుతాడో అతని పాపాలు క్షమించి వేయబడతాయి.”

4- “ఎవరైతే అజాన్ (నమాజు కొరకు ఇవ్వబడే పిలుపు) విన్న తరువాత ఈ పలుకులు “అల్లాహుమ్మ, రబ్బహాదిహిద్ద’వతిత్తామ్మహ్, వస్సలాతిల్ ఖాఇమహ్, ఆతి ముహమ్మదన్ అల్’వసీలత, వల్ ఫజీలత, వబ్’అథ్’హు మఖామన్ మహ్’మూదన్ అల్లదీ వ అద్’తహు” (ఓ అల్లాహ్! ఈ పరిపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడబోయే ఈ నిత్య నమాజు పిలుపునకు ఓ ప్రభువా! దయచేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు (తీర్పు దినమున) స్వర్గంలో ఆయనకు తప్ప మరెవరికీ లభించని అత్యున్నత స్థానమును మరియు ఆధిక్యతను ప్రసాదించు, మరియు (తీర్పు దినమున) నీవు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు వాగ్దానం చేసిన స్వర్గంలో శ్రేష్ఠమైన మరియు మరియు అత్యున్నతమైన స్థానానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను పంపు) అని పలుకుతాడో తీర్పు దినమున అతనికి నా మధ్యవర్తిత్వం ఖచ్చితంగా లభిస్తుంది