“ముఅజ్జిన్ ఇచ్చిన అజాన్ విన్నపుడు, ఎవరైతే “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, వ అన్న ముహమ్మదన్…

“ముఅజ్జిన్ ఇచ్చిన అజాన్ విన్నపుడు, ఎవరైతే “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు; రదీతు బిల్లాహి రబ్బన్, వ బి ముహమ్మదిన్ రసూలన్, వ బిల్ ఇస్లామి దీనన్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ఆయనకు సాటిగానీ, భాగస్వామి గానీ ఎవరూ లేరు అని, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను; నేను అల్లాహ్ ను నా ప్రభువుగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరునిగా మరియు ఇస్లాంను ధర్మంగా అంగీకరిస్తున్నాను, మరియు అందుకు సంతోషిస్తున్నాను) అని పలుకుతాడో అతని పాపాలు క్షమించి వేయబడతాయి.”

సా’ద్ బిన్ అబీ వఖ్ఖాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ముఅజ్జిన్ ఇచ్చిన అజాన్ విన్నపుడు, ఎవరైతే “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు; రదీతు బిల్లాహి రబ్బన్, వ బి ముహమ్మదిన్ రసూలన్, వ బిల్ ఇస్లామి దీనన్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ఆయనకు సాటిగానీ, భాగస్వామి గానీ ఎవరూ లేరు అని, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను; నేను అల్లాహ్ ను నా ప్రభువుగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరునిగా మరియు ఇస్లాంను ధర్మంగా అంగీకరిస్తున్నాను, మరియు అందుకు సంతోషిస్తున్నాను) అని పలుకుతాడో అతని పాపాలు క్షమించి వేయబడతాయి.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ముఅజ్జిన్ ఇచ్చిన అజాన్ విన్నపుడు, ఎవరైతే ఇలా పలుకుతాడో: “అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు” (నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ఆయనకు సాటిగానీ, భాగస్వామి గానీ ఎవరూ లేరు అని): అంటే దాని అర్థము: అర్థం: “అల్లాహ్ తప్ప సకల ఆరాధనలకు అర్హుడైన నిజఆరాధ్యుడు ఎవరూ లేడని, మరియు ఆయన తప్ప అరాధించబడే ప్రతిదీ అబద్ధమని నేను ధృవీకరిస్తున్నాను, అంగీకరిస్తున్నాను మరియు (ప్రపంచానికి) తెలియజేస్తున్నాను” అని. “వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు” (మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను): అంటే దాని అర్థము ఆయన అల్లాహ్ యొక్క దాసుడు, కనుక ఆయన ఆరాధించబడడు (ఆయనను ఆరాధించరాదు); మరియు ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు, ఆయన అసత్యం పలుకడు. “రజీతు బిల్లాహి రబ్బన్”: (నేను అల్లాను నా ప్రభువుగా అంగీకరిస్తున్నాను, అల్లాహ్ నా ప్రభువుగా సంతోషిస్తున్నాను): అంటే దాని అర్థము: నేను ఆయన ప్రభుతను, ఆయన దైవత్వాన్ని, ఆయన నామములు మరియు గుణలక్షణాలతో సంతృప్తి చెందాను మరియు సంతోషిస్తున్నాను. “వ బి ముహమ్మదిన్ రసూలన్”: (నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అల్లాహ్ యొక్క సందేశహరునిగా సంతోషిస్తున్నాను, అంగీకరిస్తున్నాను): అంటే దాని అర్థము: అల్లాహ్ ద్వారా ఆయనకు పంపబడిన ప్రతిదానితో మరియు ఆయన మాకు అందించిన ప్రతిదానితో నేను సంతృప్తి చెందాను మరియు సంతోషిస్తున్నాను. “వ బిల్ ఇస్లాం...”: (మరియు ఇస్లాంను ...) అంటే దాని అర్థము: ఇస్లాం యొక్క అన్ని నిబంధనల ప్రకారం, ఆదేశాలు మరియు నిషేధాలతో సహా “దీనన్...”: (ధర్మంగా...) అంటే దాని అర్థము: “ఇస్లాం ను నా ధర్మంగా విశ్వసిస్తున్నాను, మరియు విధేయుడను అవుతున్నాను”. “అతని పాపాలు క్షమించివేయబడతాయి” – అంటే దాని అర్థము అతని వల్ల జరిగిన చిన్న పాపాలు (సగాయిర్ పాపలు) క్షమించి వేయబడతాయి అని.

فوائد الحديث

అజాన్ విన్నపుడు ఈ విధంగా దుఆ చేయడం అనేది చిన్న పాపలకు పరిహారం అవుతుంది.

التصنيفات

అజాన్ మరియు ఇఖామత్