إعدادات العرض
“నమాజు కొరకు ఇవ్వబడే రెండు పిలుపులకు మధ్య (అదాన్ మరియు ఇఖామత్ ల మధ్య) నమాజు ఉన్నది; నమాజు కొరకు ఇవ్వబడే రెండు…
“నమాజు కొరకు ఇవ్వబడే రెండు పిలుపులకు మధ్య (అదాన్ మరియు ఇఖామత్ ల మధ్య) నమాజు ఉన్నది; నమాజు కొరకు ఇవ్వబడే రెండు పిలుపులకు మధ్య నమాజు ఉన్నది” తరువాత మూడవసారి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “ఎవరైతే చదవాలనుకుంటున్నారో వారి కొరకు” అన్నారు
అబ్దుల్లాహ్ బిన్ ముఘఫ్ఫల్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నమాజు కొరకు ఇవ్వబడే రెండు పిలుపులకు మధ్య (అదాన్ మరియు ఇఖామత్ ల మధ్య) నమాజు ఉన్నది; నమాజు కొరకు ఇవ్వబడే రెండు పిలుపులకు మధ్య నమాజు ఉన్నది” తరువాత మూడవసారి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “ఎవరైతే చదవాలనుకుంటున్నారో వారి కొరకు” అన్నారు.
الترجمة
العربية অসমীয়া Bahasa Indonesia Kiswahili اردو አማርኛ Tagalog Tiếng Việt ગુજરાતી Nederlands සිංහල Hausa پښتو ไทย नेपाली Кыргызча മലയാളം English Malagasy Svenska Română Kurdî Bosanski हिन्दी فارسیالشرح
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ప్రతి అదాన్ మరి ఇఖామత్’ల మధ్య నఫీల్ నమాజు ఉన్నది. ఈ విషయాన్ని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లు పునరావృతం చేసినారు. మూడవసారి – ఎవరైతే అదాన్ మరియు ఇఖామత్ లమధ్య నమాజు చదవాలుకుంటున్నారో ఇది వారి కొరకు - అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సూచించినారు.فوائد الحديث
ప్రతి అదాన్ మరియు ఇఖామత్’ల మధ్య నమాజు ఆచరించుట అభిలషణీయం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన మాటను పునరావృతం చేయడంలో వారి మార్గదర్శకం ఉన్నది - అక్కడ ఉన్నవారు ఆ విషయాన్ని వినేలా చేయడం మరియు ఆయన చెప్పే దాని యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం ఉద్దేశ్యం.
హదీథులో ‘రెండు పిలుపులు’ అనే మాటలకు అర్థం: అదాన్ మరియు ఇఖామత్. అరబీ భాషలో ఈ విధంగా జంట పదాలను వాడడం లో ముఖ్య ఉద్దేశ్యం వాటిని నొక్కి చెప్పడం, వాటి ప్రాముఖ్యతను తెలియజేయడం. ఉదాహరణకు “అల్’ఖమరైన్” (రెండు చంద్రుళ్ళు – సూర్యుడు మరియు చంద్రుడు); “అల్’ఉమరైన్” (ఇద్దరు ఉమర్’లు – అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) మరియు ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు).
“అల్ అదాన్” ఇది నమాజు యొక్క సమయం మొదలైందని ప్రకటించడం; “అల్ ఇఖామత్” సామూహిక నమాజు ప్రారంభమవుతున్నది అని ప్రకటించడం.