“ఓ బిలాల్! ‘అఖామత్’ పలుకు (నమాజు ప్రారంభించుటకు ముందు ‘నమాజు ప్రారంభమవుతున్నది’ అని తెలియజేస్తూ పలుకబడే…

“ఓ బిలాల్! ‘అఖామత్’ పలుకు (నమాజు ప్రారంభించుటకు ముందు ‘నమాజు ప్రారంభమవుతున్నది’ అని తెలియజేస్తూ పలుకబడే పదాలు), తద్వారా మా అందరికీ సాంత్వన కలుగజేయి.”

సాలిం బిన్ అబీ అల్ జ’అద్ ఉల్లేఖనం : “(మస్జిదులో) ఒక వ్యక్తి ఇలా అన్నాడు “బహుశా నేను నమాజు చదివితే విశ్రాంతి పొందేవాడిని”. అక్కడున్న వారు అతడు ఇలా అనడాన్ని వ్యతిరేకించారు. దానికి అతడు ఇలా అన్నాడు “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా నేను విన్నాను: “ఓ బిలాల్! ‘అఖామత్’ పలుకు (నమాజు ప్రారంభించుటకు ముందు ‘నమాజు ప్రారంభమవుతున్నది’ అని తెలియజేస్తూ పలుకబడే పదాలు), తద్వారా మా అందరికీ సాంత్వన కలుగజేయి.”

[దృఢమైనది] [దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు]

الشرح

సహబాలలో నుండి ఒకరు “నేను నమాజు ఆచరిస్తే బాగుండు, నాకు మనశ్శాంతి కలుగుతుంది” అన్నారు. (అతడు ‘నమాజు అయిపోతే బాగుండు, విశ్రాంతి కలుగుతుంది’ అంటున్నాడేమో అనుకుని) అక్కడ ఉన్నవారు అతడు అలా అనడాన్ని వ్యతిరేకించారు. దానికి అతడు “ఓ బిలాల్! నమాజు ప్రారంభించుట కొరకు అఖామత్ పలుకు. అందరమూ అందులో మనశ్శాంతి పొందవచ్చు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలుకగా నేను విన్నాను” అని వారికి తెలియజేసాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా ఎందుకన్నారంటే నమాజులో దాసుడు తన ప్రభువుతో ఏకాంత సంభాషణ చేస్తూ ఉంటాడు. అది అతడి ఆత్మకు, హృదయానికీ సాంత్వన కలుగజేస్తుంది.

فوائد الحديث

హృదయానికి సాంత్వన నమాజు ద్వారానే కలుగుతుంది. ఎందుకంటే అందులో సర్వోన్నతుడైన అల్లాహ్ తో ఏకాంతంగా సంభాషించే అవకాశం కలుగుతుంది.

ఈ హదీసులో ఇబాదత్ (ఆరాధన, నమాజు, సలాహ్) ను నిర్లక్ష్యం చేసే వారి కొరకు తిరస్కరణ ఉన్నది.

అలాగే ఎవరైతే తమపై విధిగావించబడిన ఆచరణలను నిర్వహించి, తమ బాధ్యతలను పూర్తి చేస్తారో వారు సాంత్వన పొందుతారు అంటే ఒకరకమైన నిశ్చింత, నిబ్బరము, ప్రశాంతత పొందుతారు.

التصنيفات

నమాజు ప్రాముఖ్యత, అజాన్ మరియు ఇఖామత్