నా దాసుడు ఒకడు పాపపు పని చేసినాడు. తరువాత ఇలా వేడుకున్నాడు “ఓ అల్లాహ్, నా ఈ పాపాన్ని క్షమించు

నా దాసుడు ఒకడు పాపపు పని చేసినాడు. తరువాత ఇలా వేడుకున్నాడు “ఓ అల్లాహ్, నా ఈ పాపాన్ని క్షమించు

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “సర్వ శక్తిమంతుడు, మహోన్నతుడు అయిన తన ప్రభువు ఇలా ప్రవచించినాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలికారు: “నా దాసుడు ఒకడు పాపపు పని చేసినాడు. తరువాత ఇలా వేడుకున్నాడు “ఓ అల్లాహ్, నా ఈ పాపాన్ని క్షమించు.” అపుడు పరమ పవితృడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా పలికాడు “నా దాసుడు పాపపు పని చేసాడు, తరువాత తనకొక ప్రభువు ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన తన పాపాలను క్షమిస్తాడని మరియు పాపపు పనులకు పాల్బడితే శిక్షిస్తాడని గ్రహించాడు. తరువాత అతడు మళ్ళీ పాపపు పని చేసాడు. అతడు మళ్ళీ ఇలా వేడుకున్నాడు “ఓ నా ప్రభూ! నా ఈ పాపాన్ని క్షమించు”. అపుడు పరమ పవిత్రుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా పలికాడు “నా దాసుడు పాపపు పని చేసాడు, తరువాత తనకొక ప్రభువు ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన తన పాపాలను క్షమిస్తాడని, మరియు పాపపు పనులకు పాల్బడితే శిక్షిస్తాడని గ్రహించాడు. నేను నా దాసుణ్ణి క్షమించాను. అతడు ఏమి చేయ దలుచుకుంటే అది చేయనివ్వండి”.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువు నుండి ఇలా ఉల్లేఖించినారు – ఒకవేళ అల్లాహ్ యొక్క దాసుడు ఏదైనా పాపపు పనికి ఒడిగట్టి, ఆ తరువాత అల్లాహ్ ను ‘ఓ అల్లాహ్ నా ఈ పాపాన్ని క్షమించు’ అని వేడుకున్నట్లయితే, దానికి అల్లాహ్ ఇలా పలుకుతాడు ‘నా దాసుడు పాపపు పనికి ఒడిగట్టినాడు, అతడికి తెలుసు అతనికి ఒక ప్రభువు ఉన్నాడని, ఆయన పాపాల్ను క్షమిస్తాడని, వాటిని కప్పివేస్తాడని, వాటిని చూసీ చూడనట్టు వదిలి వేస్తాడని – లేక పాపపు పనులకు పాల్బడినందుకు శిక్షిస్తాడని. కాబట్టి నేను అతడిని క్షమించాను. తరువాత, అల్లాహ్ యొక్క దాసుడు తిరిగి ఏదైనా పాపపు పనికి ఒడిగట్టి, తరువాత తిరిగి అల్లాహ్ ను ‘ఓ అల్లాహ్ నా ఈ పాపాన్ని క్షమించు’ అని వేడుకున్నట్లయితే, అల్లాహ్ ఇలా పలుకుతాడు ‘నా దాసుడు పాపపు పనికి ఒడిగట్టినాడు, అతడికి తెలుసు అతనికి ఒక ప్రభువు ఉన్నాడని, ఆయన పాపాల్ను క్షమిస్తాడని, వాటిని కప్పివేస్తాడని, వాటిని చూసీ చూడనట్టు వదిలి వేస్తాడని – లేక పాపపు పనులకు పాల్బడినందుకు శిక్షిస్తాడని. కాబట్టి నేను నా దాసుణ్ణి క్షమించాను. తరువాత, అల్లాహ్ యొక్క దాసుడు తిరిగి ఏదైనా పాపపు పనికి ఒడిగట్టి, తరువాత తిరిగి అల్లాహ్ ను ‘ఓ అల్లాహ్ నా ఈ పాపాన్ని క్షమించు’ అని వేడుకున్నట్లయితే, అల్లాహ్ ఇలా పలుకుతాడు ‘నా దాసుడు పాపపు పనికి ఒడిగట్టినాడు, అతడికి తెలుసు అతనికి ఒక ప్రభువు ఉన్నాడని, ఆయన పాపాలను క్షమిస్తాడని, వాటిని కప్పివేస్తాడని, వాటిని చూసీ చూడనట్టు వదిలి వేస్తాడని – లేక పాపపు పనులకు పాల్బడినందుకు శిక్షిస్తాడని. కాబట్టి నేను నా దాసుణ్ణి క్షమించాను. కనుక, అతడు పాపపు పనికి ఒడిగట్టిన ప్రతిసారీ దానిని విడిచిపెట్టి, దానికి పాల్బడినందుకు హృదయపూర్వకంగా పాశ్చాత్తాపపడి, తిరిగి ఆ పనికి ఒడిగట్టనని తీర్మానించు కున్నట్లయితే, అతడు ఏమి చేయ దలుచుకుంటే అది చేయనివ్వండి. కాని అతడి ఆత్మ అతడిని లోబరుచుకుంటుంది, దానితో తిరిగి అతడు పాపపు పనిలో పడిపోతాడు. అటువంటి పాపపు పనికి ఒడిగట్టిన ప్రతిసారీ అతడు హృదయపూర్వకంగా పశ్చాత్తాప పడినంత కాలము నేను అతడిని క్షమిస్తాను. ఎందుకంటే, పశ్చాత్తాపము పూర్వము జరిగిన దానిని తుడిచివేస్తుంది.

فوائد الحديث

ఇందులో తన దాసుల పట్ల అల్లహ్ యొక్క అపారమైన కరుణ కనిపిస్తుంది. మనిషి ఏదైనా పాపాని ఒడిగట్టి నట్లయితే లేదా ఏదైనా చేయకూడని పని చేసినట్లయితే, అందుకొరకు అతడు హృదయపూర్వకంగా పశ్చాత్తాప పడాలి. ఒకవేళ అతడు అలా పశ్చాత్తాప పడి అల్లాహ్ వైపునకు మరలి నట్లయితే, అల్లాహ్ అతని వైపునకు క్షమాభిక్షతో స్పందిస్తాడు.

సరోన్నతుడైన అల్లాహ్ నందు విశ్వసించే ప్రతి విశ్వాసి తన ప్రభువు యొక్క క్షమాభిక్షనందు ఆశతో ఉంటాడు, ఆయన విధించే శిక్ష పట్ల భయపడతాడు. కనుక పశ్చాత్తాప పడుటలో త్వరపడతాడు. పాపపు పనికి ఒడిగట్టి ఆయన యొక్క అవిధేయతలో అలాగే ఉండిపోవడానికి ఇష్టపడడు.

నిజమైన పశ్చాత్తాపమునకు నియమనిబంధనలు: 1) చేసిన పాపపు పనిని వదిలి వేయాలి. 2) ఆ పని చేసినందుకు సిగ్గుపడాలి, దుఃఖించాలి, విచారపడాలి మరియు 3) పాపపు పనికి తిరిగి ఒడిగట్టనని గట్టిగా సంకల్పించుకోవాలి. ఒకవేళ అతడి పశ్చాత్తాపము తోటివారికి తన వలన జరిగిన అన్యాయము, హింస, పీడన మొదలైన వాటికి సంబంధించినది అయితే, నాలుగవ నియమము వచ్చి చేరుతుంది, అది: హక్కుదారుడైన ఆ వ్యక్తి నుండి వేరుపడి, దూరంగా ఉండాలి (అతడి జోలికి వెళ్ళకుండా ఉండాలి) మరియు అతడి హక్కును అతడికి ఇచ్చివేయాలి.

ఇందులో – అల్లాహ్ ను గురించి తెలిసి ఉండడం, ఆయనను గురించి ఙ్ఞానము కలిగి ఉండడం యొక్క ప్రాముఖ్యత తెలుస్తున్నది. అల్లాహ్ ను గురించిన ఙ్ఞానము, ధర్మానికి సంబంధించిన విషయాలతో దాసుడిని అవగతం చేస్తుంది. దానితో అతడు తన వల్ల తప్పు జరిగిన ప్రతిసారీ వెంటనే పశ్చాత్తాప పడతాడు. మార్గాంతరం లేని వానిలా నిరాశ, నిస్పృహలకు లోను కాడు. అలాగే కోరికలకు బానిసైపోయి, పాపపు జీవితానికి తనను అంకితం చేసుకోడు.

التصنيفات

జిక్ర్ ప్రాముఖ్యతలు