“ఏ సమావేశములోనైతే అల్లాహ్ నామస్మరణ జరుగదో, అటువంటి సమావేశము నుండి లేచిన ప్రజలు, వాస్తవానికి ఒక గాడిద శవము వద్ద…

“ఏ సమావేశములోనైతే అల్లాహ్ నామస్మరణ జరుగదో, అటువంటి సమావేశము నుండి లేచిన ప్రజలు, వాస్తవానికి ఒక గాడిద శవము వద్ద నుండి లేచిన వారితో సమానము. అది వారి కొరకు దుఃఖ కారణం అవుతుంది.”

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఏ సమావేశములోనైతే అల్లాహ్ నామస్మరణ జరుగదో, అటువంటి సమావేశము నుండి లేచిన ప్రజలు, వాస్తవానికి ఒక గాడిద శవము వద్ద నుండి లేచిన వారితో సమానము. అది వారి కొరకు దుఃఖ కారణం అవుతుంది.”

[దృఢమైనది] [దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసినారు: “ప్రజలు ఏదైనా ఒక సమావేశములో పాల్గొని ఉండి, అందులో అల్లాహ్ యొక్క ప్రస్తావన లేకుండానే వెళ్ళిపోయినట్లయితే, అది దుర్గంధం మరియు ధూళితో కలిసి ఉన్న ఒక గాడిద మృతదేహం చుట్టూ కూర్చుని లేచి వెళ్ళిన దానితో సమానం. ఎందుకంటే, వారు అల్లాహ్ పేరును ప్రస్తావించకుండా మిగతా విషయాలు మాట్లాడడంలో మునిగిపోయారు. తీర్పుదినము నాడు అటువంటి సమావేశము వారి కొరకు దుఃఖ కారణం అవుతుంది, మరియు నిరంతర విచారానికి కారణం అవుతుంది.

فوائد الحديث

ఇందులో అల్లాహ్ ను స్మరించడంలో నిర్లక్ష్యం గురించి చేయబడిన హెచ్చరిక ప్రస్తావించబడినది; ఇది సమావేశాలకు మాత్రమే పరిమితం కాదు. అటువంటి అన్ని సందర్భాలకూ ఇది వర్తిస్తుంది. ఇమాం అన్’నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఎవరైనా సరే ఒక ప్రదేశంలో కూర్చుని, బయలుదేరి వెళ్ళడానికి ముందు వరకూ అల్లాహ్’ను స్మరించకపోవడం అసహ్యమైన పనిగా భావించబడినది.

పునరుత్థాన దినమున వారికి సంభవించే విచారం: అల్లాహ్’కు విధేయత చూపడంలో సమయాన్ని వెచ్చించి ఉంటే లభించి ఉండే ప్రయోజనంమ రియు ప్రతిఫలం కోల్పోవడం వలన కావచ్చు; లేదా తమ సమయాన్ని అల్లాహ్ యొక్క అవిధేయతలో గడిపిన కారణంగా లభించే పాపము మరియు శిక్ష కారణంగా కావచ్చు.

ఈ హెచ్చరిక అనుమతించబడిన విషయాలలో నిర్లక్ష్యం వహించడం పట్ల ఉంటే, ఇక చాడీలు, పితూరీలు, అక్కడ లేని వారి పట్ల నిందారోపణలు, అవహేళనా పూరితమైన మాటలు మొదలైనవి నడిచే హరాం సమావేశాల గురించి ఏమనాలి?

التصنيفات

జిక్ర్ ప్రాముఖ్యతలు