అల్లాహ్ యొక్క దాసుడు నిద్ర లేచే దినములలో – ఇద్దరు దైవదూతలు అవతరించి, వారిలో ఒకరు “ఓ అల్లాహ్! (పిసినారితనం…

అల్లాహ్ యొక్క దాసుడు నిద్ర లేచే దినములలో – ఇద్దరు దైవదూతలు అవతరించి, వారిలో ఒకరు “ఓ అల్లాహ్! (పిసినారితనం వహించకుండా) ఎవరైతే ఖర్చు పెడతాడో, అతడు ఖర్చు పెట్టిన దానికి బదులుగా అతనికి (ఇంకా) ప్రసాదించు” అని, మరొకరు “ఓ అల్లాహ్! ఎవరైతే కూడబెట్టుకుని ఉంచుకుంటాడో అతనికి వినాశం ప్రసాదించు” అని ప్రార్థించకుండా ఒక్క దినము కూడా గడవదు.”

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: అల్లాహ్ యొక్క దాసుడు నిద్ర లేచే దినములలో – ఇద్దరు దైవదూతలు అవతరించి, వారిలో ఒకరు “ఓ అల్లాహ్! (పిసినారితనం వహించకుండా) ఎవరైతే ఖర్చు పెడతాడో, అతడు ఖర్చు పెట్టిన దానికి బదులుగా అతనికి (ఇంకా) ప్రసాదించు” అని, మరొకరు “ఓ అల్లాహ్! ఎవరైతే కూడబెట్టుకుని ఉంచుకుంటాడో అతనికి వినాశం ప్రసాదించు” అని ప్రార్థించకుండా ఒక్క దినము కూడా గడవదు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "సూర్యుడు ఉదయించే ప్రతి దినము, ఇద్దరు దేవదూతలు దివి నుండి అవతరించి అల్లాహ్’ను ఇలా ప్రార్థిస్తారు: వారిలో ఒకరు ఇలా అంటాడు: “ఓ అల్లాహ్! ఎవరైతే విధేయతా చర్యలపై ఖర్చు చెస్తాడో, అంటే సత్కార్యాలు చేస్తూ ఉంటాడో, తన బంధువుల కొరకు, అతిథుల కొరకు, స్వచ్ఛంద కార్యాల కొరకు ఖర్చు పెట్టే వానికి, అతడు ఖర్చు పెట్టిన దాని కంటే మెరుగైన ప్రతిఫలాన్ని ప్రసాదించు మరియు వానిపై నీ అనుగ్రహాన్ని కురిపించు.” మరొక దైవదూత ఇలా అంటాడు: “ఓ అల్లాహ్! ఎవరైతే కూడబెట్టి (పిసినారితనంతో ఖర్చు చేయకుండా) ఉంచుకుంటాడో, వానికి వినాశనాన్ని ప్రసాదించు.”

فوائد الحديث

ఉదారంగా ఖర్చు చేయువాని గురించి అతనికి ఎక్కువ ప్రతిఫలం ప్రసాదించమని, అతడు ఖర్చు చేసిన దానికంటే మెరుగైన దానితో, అతడు ఖర్చు చేసిన దానిని భర్తీ చేయమని అల్లాహ్’ను ప్రార్థించడం అనుమతించబడినదే; అలాగే పిసినారిని గురించి, అల్లాహ్ విధిగావించిన విషయాలపై కూడా ఖర్చు చేయకుండా, సంపదను కూడ బెట్టి నిలిపి ఉంచుకున్న దానిని అతడు నష్టపోయేలా చేయమని అతనికి వ్యతిరేకంగా ప్రార్థించడం కూడా అనుమతించబడినదే.

ధార్మికులైన విశ్వాసుల కొరకు, ఎవరైతే అల్లాహ్ మార్గములో మరియు అల్లాహ్ ఆదేశించిన విషయాలపై ఖర్చు చేస్తారో, వారి కొరకు దైవదూతలు ప్రార్థిస్తారు, మరియు వారి దుఆలను అల్లాహ్ ఆమోదిస్తాడు.

ఇందులో విధిచేయబడిన కార్యాలపై మరియు స్వచ్ఛంద కార్యాలపై ఖర్చు చేయాలి అనే హితబోధ ఉన్నది, ఉదాహరణకు కుటుంబసభ్యులపై ఖర్చు చేయుటం బంధుత్వాల కొనసాగింపు కొరకు బంధువులపై ఖర్చు చేయుట మరియు సత్కార్యాలపై ఖర్చు చేయుట మొదలైనవి.

దానధర్మాల కొరకు ఖర్చు చేయు వారి యోగ్యతను, ఘనతను వివరిస్తూ, పర్యవసానంగా అల్లాహ్ వారికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అని తెలుపుతూ దివ్య ఖుర్’ఆన్’లో అల్లాహ్ ఇలా ప్రకటించినాడు: “....మరియు మీరు (ఆయన మార్గంలో) ఖర్చుపెట్టేదంతా ఆయన మీకు తిరిగి ఇస్తాడు. మరియు ఆయనే సర్వశ్రేష్ఠుడైన జీవనోపాధి ప్రదాత.” (సూరహ్ సబా 34:39)

పిసినారులకు వ్యతిరేకంగా చేయబడిన దుఆ ఏదైతే ఉందో అది ఎవరైతే విధిగా ఖర్చుచేయవలసిన విషయాలపై కూడా ఉదారంగా ఖర్చు చేయకుండా సంపదను నిలిపి ఉంచుకుని పిసినారితనం వహిస్తారో అటువంటి వారి కొరకు మాత్రమే. విధిగా చేయవలసిన ఖర్చులో, స్వచ్చంద కార్యాలపై ఖర్చుచేయడం లేదు. కనుక ఆ దుఆకు ఇటువంటి వారు అర్హులు కారు.

పిసినారితనం, దురాశ హరాం (నిషేధించబడినవి).

التصنيفات

నఫిల్ దానాలు