నువ్వు ఒక దీనార్ అల్లాహ్ మార్గంలో ఖర్చు చేశావు మరొకటి బానిస విముక్తి కోసం ఇంకొకటి బీధవాడికి దానం చేశావు మరో…

నువ్వు ఒక దీనార్ అల్లాహ్ మార్గంలో ఖర్చు చేశావు మరొకటి బానిస విముక్తి కోసం ఇంకొకటి బీధవాడికి దానం చేశావు మరో దీనార్ నీ కుటుంబీకులపై ఖర్చు చేశావు అందులో పుణ్యప్రధంగా విలువైనది ‘నీ కుటుంబీకుల పై ఖర్చు చేసినదే’

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: నువ్వు ఒక దీనార్ అల్లాహ్ మార్గంలో ఖర్చు చేశావు మరొకటి బానిస విముక్తి కోసం ఇంకొకటి బీధవాడికి దానం చేశావు మరో దీనార్ నీ కుటుంబీకులపై ఖర్చు చేశావు అందులో పుణ్యప్రధంగా విలువైనది ‘నీ కుటుంబీకుల పై ఖర్చు చేసినదే’

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని దానధర్మాల గురించి ఇలా పేర్కొన్నారు: "నీవు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసిన దీనార్, బానిసను విముక్తి చేయడంలో ఖర్చు చేసిన దీనార్, అక్కరగల పేదవారికి దానం చేసిన దీనార్, మరియు నీ కుటుంబ సభ్యులు, నీపై ఆధారపడిన వారిపై ఖర్చు చేసిన దీనార్ — వీటన్నింటిలో అల్లాహ్ దృష్టిలో అత్యధిక ప్రతిఫలం కలిగినది, నీవు నీ కుటుంబంపై మరియు నీపై ఆధారపడినవారి అవసరాలకు ఖర్చు చేసినదే" అని ప్రవక్త స్పష్టం చేశారు.

فوائد الحديث

అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసే ముఖ్యమైన మార్గాలు అనేకం ఉన్నాయి.

దానం అందుకోవడానికి ఎక్కువ మంది ఉన్నప్పుడు దానం చేసే సమయంలో వారిలో ఎక్కువ అర్హులైన వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమం అంటే ఇతరులందరికీ దానం చేయలేనప్పుడు తన కుటుంబంపైనే ఖర్చు చేయడం ఉత్తమం.

నవవీ రహిమహుల్లాహ్ తన సహీహ్ ముస్లిం వ్యాఖ్యానంలో ఇలా అన్నారు: ఈ హదీథు తనపై ఆధారపడిన వారిపై ఖర్చు చేయడాన్ని ప్రోత్సహిస్తున్నది మరియు అలా చేయడంలో గొప్ప ప్రతిఫలం ఉందని సూచిస్తున్నది. వారిలో కొంతమందికి రక్త సంబంధాల కారణంగా మద్దతు ఇవ్వడం తప్పనిసరి, మరికొంతమందికి ఇది సిఫారసు చేయబడింది. ఇంకా అది దానంగా కూడా పరిగణించబడుతుంది మరియు సంబంధాలను నిర్వహించే మార్గంగా ఉంటుంది, మరియు కొంతమందికి వివాహం కొరకు ఖర్చు పెట్టడం లేదా బానిస యాజమాన్యం నుండి విడిపించేందుకు ఖర్చు పెట్టడం అనే కారణంగా ఇది తప్పనిసరి అవుతుంది. ఇవన్నీ చాలా ప్రశంసనీయమైనవి మరియు ప్రోత్సహించబడతాయి, మరియు ఇది స్వచ్ఛంద దానం కంటే ఉత్తమమైనది.

అస్సిందీ ఇలా చెప్పినారు: "ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన 'తనపై ఆధారపడినవారిపై ఖర్చు చేసిన దీనార్' అన్న మాటలో ఉద్దేశ్యం ఏమిటంటే - ఒకరు ఆ ఖర్చును కేవలం అల్లాహ్ కోసం, తనపై ఆధారపడినవారి హక్కులను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఖర్చు చేస్తే, అది గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తుంది."

అబూ ఖిలాబా (రహిమహుల్లాహ్) ఈ హదీథుపై వ్యాఖ్యానిస్తూ ఇలా చెప్పినారు: "ఒక వ్యక్తి తన చిన్న పిల్లలపై ఖర్చు చేసి, వారిని అవసరాల నుండి, అభ్యర్థన నుండి, తప్పు మార్గాల నుండి వారిని రక్షిస్తే, లేదా అల్లాహ్ అతని ద్వారా వారికి మేలు కలగ జేసి, వారిని స్వయం సమృద్ధిగా చేస్తే — ఆ వ్యక్తి కంటే ఎక్కువ ప్రతిఫలం ఎవరు పొందుతారు?!"

التصنيفات

ఖర్చు చేయటం, నఫిల్ దానాలు