إعدادات العرض
“ఎవరైతే తన కూతుళ్లను జాగ్రత్తగా చూసుకుంటారో మరియు వారితో దయగా వ్యవహరిస్తారో, వారు అతనికి నరకాగ్ని నుండి…
“ఎవరైతే తన కూతుళ్లను జాగ్రత్తగా చూసుకుంటారో మరియు వారితో దయగా వ్యవహరిస్తారో, వారు అతనికి నరకాగ్ని నుండి రక్షణగా (తెరగా) ఉంటారు
విశ్వాసుల మాతృమూర్తి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యామణులలో ఒకరైన ఆయిషా రదియల్లాహు అన్హా తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చెప్పిన ఒక విషయాన్ని ఈ హదీథులో ఉల్లేఖిస్తున్నారు: “ఒక స్త్రీ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నా దగ్గరకు వచ్చి ఏమైనా దానం చేయమని అడిగింది. నా దగ్గర ఒక ఖర్జూరం తప్ప మరేమీ లేదని ఆమె గ్రహించింది, ఆ ఒక్క ఖర్జూరాన్నే నేను ఆమెకు ఇచ్చాను. ఆమె దానిని రెండు భాగాలు చేసి తన ఇద్దరు కూతుళ్లకు చెరొకటి ఇచ్చింది, (ఆ పిల్లలిద్దరు తిన్న తరువాత) ఆమె అక్కడి నుండి వెళ్లిపోయింది. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చినపుడు నేను వారికి ఈ విషయం గురించి తెలియజేసాను. అపుడు వారు ఇలా అన్నారు: “ఎవరైతే తన కూతుళ్లను జాగ్రత్తగా చూసుకుంటారో మరియు వారితో దయగా వ్యవహరిస్తారో, వారు అతనికి నరకాగ్ని నుండి రక్షణగా (తెరగా) ఉంటారు."
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Tiếng Việt Hausa Kurdî Magyar ქართული Kiswahili සිංහල Română অসমীয়া ไทย Português मराठी ភាសាខ្មែរ دری አማርኛ ગુજરાતી Македонски Nederlands ਪੰਜਾਬੀ മലയാളം ಕನ್ನಡالشرح
విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా నివేదించినారు: ఒక స్త్రీ తన ఇద్దరు కుమార్తెలతో తన వద్దకు వచ్చి తినడానికి ఏదైనా దానం చేయమని అడిగింది. ఆయిషా రదియల్లాహు అన్హా దగ్గర ఒక్క ఖర్జూరం తప్ప మరేమీ లేదు, ఆమె ఆ ఒక్క ఖర్జూరాన్ని కూడా ఆమెకు ఇచ్చివేసినారు. ఆ స్త్రీ తన ఇద్దరు కుమార్తెలకు ఖర్జూరాన్ని పంచిపెట్టింది, ఆమె దాని నుండి ఏమీ తినలేదు. తరువాత ఆమె లేచి వెళ్ళిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లోపలికి ప్రవేశించారు మరియు ఆయిషా రదియల్లాహు అన్హా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు జరిగింది వివరించారు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వస్లలం ఇలా అన్నారు: తమ కుమార్తెల పట్ల బాధ్యత వహించి, వారిని జాగ్రత్తగా చూసుకుని, వారి పట్ల మంచిగా ప్రవర్తించేవాడు - వారికి విద్య నేర్పడం, తినిపించడం, తాగించడం, దుస్తులు ధరించడం మరియు ఇవన్నీ ఓపికగా భరించేవారు – అటువంటి వారికి ఆ పిల్లలు నరకాగ్ని నుండి రక్షణ కవచంగా మరియు నరకాగ్ని వారిని తాకకుండా ఒక అడ్డుతెరగా ఉంటారు.فوائد الحديث
కుమార్తెలను చూసుకోవడం మరియు వారి పెంపకము, ఎదుగుదలలో వారికి అన్నివిధాలా అండగా నిలవడం, మద్దతు ఇవ్వడం నరకాగ్ని నుండి రక్షించే ఉత్తమ ధార్మిక కార్యాలలో ఒకటి.
ఒకరు తేలికగా ఇవ్వగలిగినంత దానం చేయాలని సిఫార్సు చేయబడింది, అది చిన్నదే అయినా సరే.
తల్లిదండ్రులకు పిల్లల పట్ల గాఢమైన అనురాగం, ప్రేమ, మమకారం ఉంటాయి.
ఈ హదీథు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబ పరిస్థితిని గురించి స్పష్టం చేస్తున్నది, ఆయన ఇంటిలో ఆహారపదార్థాలు (పుష్కలంగా కాకుండా), కేవలం అవసరమైనంత మాత్రమే ఉండేవి.
ఇది నిస్వార్థత యొక్క ఘనతను వివరిస్తుంది మరియు అది విశ్వాసుల లక్షణం అని వివరిస్తుంది. ఆయిషా రదియల్లాహు అన్హా తన ఇంటిలో ఉన్నది ఒక్క ఖర్జూరమే అయినా, తనకు దాని అవసరం ఉన్నప్పటికీ, తన కంటే ఆ స్త్రీకి మరియు ఆమె ఇద్దరు పిల్లలకు ప్రాధాన్యనత ఇచ్చినారు. ఆ విధంగా తన దాతృత్వాన్ని, గొప్ప ఉదారతను ప్రదర్శించినారు.
కుమార్తెలను కలిగి ఉండడం నిజానికి ఒక ఆశీర్వాదం, కానీ అది 'పరీక్ష' అని కూడా పిలువబడుతుంది, ఎందుకంటే వారి పెంపకంలో ఎదురయ్యే కష్టాలు మరియు అలసట కారణంగా, లేదా కొంతమంది ఆడసంతానాన్ని ఇష్టపడరు, లేదా వారికి తరచుగా సంపాదించడానికి మరియు జీవించడానికి మార్గాలు లేనందున, ఆడపిల్లలను కలిగి ఉండడం ఒక ‘పరీక్ష’ అంటారు.
ఇస్లాం ధర్మం పూర్వ ఇస్లామీయ యుగంలోని అసహ్యకరమైన పద్ధతులను నిర్మూలించడానికి వచ్చింది, అందువలన ఇది కుమార్తెలను గౌరవించాలని మరియు వారి పట్ల తగిన శ్రద్ధ వహించాలని పిలుపునిస్తుంది.
ఈ హదీథులో కూతుళ్లను కలిగి ఉన్న తల్లిదండ్రుల కొరకు పేర్కొనబడిన ‘ప్రతిఫలం’ (బహుమతి), కొన్ని ఇతర హదీథులలో పేర్కొనబడిన విధంగా ఒక్క కూతురే ఉన్నా కూడా లభిస్తుంది.
