. .

సాద్ ఇబ్న్ ఉబాదహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం – ఆయన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నారు: “ఓ రసులుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఉమ్మె సాద్ (నా తల్లి) చనిపోయింది. (ఆమె కొరకు) ఏ దానము ఉత్తమమైనది?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “త్రాగునీరు”. ఆయన ఒక బావిని త్రవ్వించి “ఇది ఉమ్మె సాద్ కొరకు” అన్నారు.

الشرح

సాద్ ఇబ్న్ ఉబాదహ్ (రదియల్లాహు అన్హు) గారి తల్లి చనిపొయింది. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆమె పేరున ఏ దానము చేయుట ఉత్తమంగా ఉంటుంది అని అడిగారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం త్రాగునీరు ఏర్పాటు చేయుట ఉత్తమమైనది అని అన్నారు. అపుడు ఆయన ఒక బావిని త్రవ్వించి దానిని తన తల్లి పేరున అర్పణ చేసారు.

فوائد الحديث

ఇందులో ‘త్రాగునీరు’ ఏర్పాటు చేయుట ఉత్తమైన దానము అని తెలియుచున్నది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాద్ బిన్ ఉబాదహ్ (రదియల్లాహు అన్హు) కు త్రాగునీటిని దానంగా ఏర్పాటు చేయమని సూచించారు, ఎందుకంటే ధార్మికపరంగానూ, ప్రాపంచిక పరంగానూ త్రాగు నీటిని ఏర్పాటు చేయుట అనేది బహు ప్రయోజనకరమైనది.మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా సూచించడానికి విపరీతమైన వేడి, త్రాగునీటి అవసరం మరియు త్రాగునీటి ఎద్దడి కూడా కారణాలు.

ఈ హదీథులో మనం చేసే దానధర్మాల పుణ్యఫలం చనిపోయిన వారికి చేరుతుంది అనడానికి రుజువు ఉన్నది.

ఇందులో తన తల్లి పట్ల సాద్ ఇబ్న్ ఉబాద (రదియల్లాహు అన్హు) యొక్క ప్రేమ, కరుణ, గౌరవం కనిపిస్తున్నాయి, వారిద్దరినీ అల్లాహ్ ఇష్టపడుగాక.

التصنيفات

నివృత్తి, నఫిల్ దానాలు