“పరమ పవిత్రుడు, సర్వశుభాల అధికారి, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ స్వర్గవాసులతో ఇలా అంటాడు: “ఓ స్వర్గవాసులారా!”;…

“పరమ పవిత్రుడు, సర్వశుభాల అధికారి, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ స్వర్గవాసులతో ఇలా అంటాడు: “ఓ స్వర్గవాసులారా!”; వారు “ఓ మా ప్రభూ! మేము హాజరుగా ఉన్నాము, నీ ఇష్టానికి, సంతోషానికి అనుగుణంగా ఉన్నాము” అని జవాబిస్తారు. అపుడు ఆయన “మీరు సంతృప్తిగా ఉన్నారా?” అని అడుగుతాడు; దానికి వారు “నీ సృష్ఠిలో ఎవ్వరికీ ప్రసాదించని దానిని నిశ్చయంగా నీవు మాకు ప్రసాదించినపుడు, మేము సంతృప్తిగా ఎందుకు ఉండము?

అబూ సఈద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “పరమ పవిత్రుడు, సర్వశుభాల అధికారి, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ స్వర్గవాసులతో ఇలా అంటాడు: “ఓ స్వర్గవాసులారా!”; వారు “ఓ మా ప్రభూ! మేము హాజరుగా ఉన్నాము, నీ ఇష్టానికి, సంతోషానికి అనుగుణంగా ఉన్నాము” అని జవాబిస్తారు. అపుడు ఆయన “మీరు సంతృప్తిగా ఉన్నారా?” అని అడుగుతాడు; దానికి వారు “నీ సృష్ఠిలో ఎవ్వరికీ ప్రసాదించని దానిని నిశ్చయంగా నీవు మాకు ప్రసాదించినపుడు, మేము సంతృప్తిగా ఎందుకు ఉండము?” అని జవాబిస్తారు. అపుడు ఆయన “నేను మీకు దానికంటే కూడా ఉత్తమమైన దానిని ప్రసాదిస్తాను” అంటాడు. వారు “ఓ మా ప్రభూ! దీనికంటే ఉత్తమమైనది ఇంకేముంటుంది?” అంటారు. అప్పుడు ఆయన ఇలా అంటాడు: “నేను మీకు నా ప్రమోదాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తాను మరియు ఆ తర్వాత నేను మీ పట్ల ఎన్నటికీ అసంతృప్తి చెందను.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: స్వర్గములో స్వర్గవాసులు ఉంటూ ఉండగా వారితో సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు: “ఓ స్వర్గవాసులారా!”; దానికి వారు “మేము హాజరుగా ఉన్నాము ఓ మా ప్రభూ!, నీ ఇష్టానికి, సంతోషానికి అనుగుణంగా ఉన్నాము” అని జవాబిస్తారు. అపుడు ఆయన వారిని “మీరు సంతృప్తిగా ఉన్నారా?” అని ప్రశ్నిస్తాడు. దానికి వారు “అవును ఓ మా ప్రభూ! మేము సంతృప్తిగా ఉన్నాము; నీ సృష్టిలో ఎవ్వరికీ ప్రసాదించని దానిని నిశ్చయంగా నీవు మాకు ప్రసాదించినపుడు, మేము సంతృప్తిగా ఎందుకు ఉండము?” అని జవాబిస్తారు. అపుడు పరమ పవిత్రుడు అయిన ఆయన “మీకు అంత కంటే ఉత్తమమైన దానిని ప్రసాదించనా?” అని అడుగుతాడు. వారు: “ఓ మా ప్రభూ! దీనికంటే ఉత్తమమైనది ఏముంటుంది?” అంటారు. (అల్లాహ్) ఇలా అంటాడు: "నేను మీపై నా శాశ్వతమైన అనుగ్రహాన్ని అవతరింపజేస్తాను. ఆ తరువాత నేను మీపై ఎలాంటి ఆగ్రహాన్ని చూపను.”

فوائد الحديث

స్వర్గపు ప్రజలతో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మాట్లాడడం.

స్వర్గవాసులకు అల్లాహ్ నుండి శుభవార్త ఏమిటంటే, ఆయన వారి పట్ల సంతోషిస్తున్నాడు మరియు ఆయన వారికి తన ప్రసన్నతను ప్రసాదిస్తాడు మరియు వారి పట్ల ఎన్నడూ ఆగ్రహాన్ని కలిగి ఉండడు.

స్వర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి వారి స్థితి మరియు వారి స్థాయిలలో వైవిధ్యం, తేడాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ తన పరిస్థితితో పూర్తి సంతోషంగా, పూర్తి సంతృప్తితో ఉండడం కనిపిస్తుంది. ఎందుకంటే వారందరూ ఒకే మాటతో సమాధానమిచ్చారు: “ఓ మా ప్రభూ! నీ సృష్టిలో ఎవ్వరికీ ప్రసాదించని దానిని నిశ్చయంగా నీవు మాకు ప్రసాదించినావు” అని.

التصنيفات

తౌహీదె అస్మా వ సిఫాత్, స్వర్గము,నరకము యొక్క లక్షణాలు