“కరుణ చూపే వారిపై, అనంత కరుణాప్రదాత (అర్రహ్మాన్) కరుణ చూపుతాడు; కనుక భూమిపై ఉన్నవారిపై కరుణ చూపండి, ఆకాశంలో…

“కరుణ చూపే వారిపై, అనంత కరుణాప్రదాత (అర్రహ్మాన్) కరుణ చూపుతాడు; కనుక భూమిపై ఉన్నవారిపై కరుణ చూపండి, ఆకాశంలో ఉన్నవాడు మీపై కరుణ చూపుతాడు.”

అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “కరుణ చూపే వారిపై, అనంత కరుణాప్రదాత (అర్రహ్మాన్) కరుణ చూపుతాడు; కనుక భూమిపై ఉన్నవారిపై కరుణ చూపండి, ఆకాశంలో ఉన్నవాడు మీపై కరుణ చూపుతాడు.”

[దృఢమైనది]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు – ఎవరైతే ఇతరులపై కరుణ చూపుతారో, వారిని అనంత కరుణాప్రదాత, ప్రతిదాన్నిఆవరించి ఉన్న తన కరుణతో కరుణిస్తాడు – అది ఒక పరిపూర్ణ ప్రతిఫలం. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భూమిపై ఉన్న ప్రతి ఒక్కరిపై కరుణ చూపమని ఆదేశిస్తున్నారు – మనుషులు, పశువులు, పక్షులు మరియు సృష్ఠిలోని ప్రతి జాతి సృష్ఠితాలు అన్నింటిపైనా. దానికి ప్రతిఫలం – ఆకాశాలపై ఉన్న అల్లాహ్ మీపై కరుణ చూపుతాడు.

فوائد الحديث

ఇస్లాం ధర్మము, ఒక శాంతి పూర్వకమైన, కరుణా పూరితమైన ధర్మము; అది సంపూర్ణంగా అల్లాహ్ కు విధేయత చూపుట, మరియు సృష్ఠిలోని సృష్ఠితాలన్నింటిపై కరుణ చూపుట అను విషయాలపై నిలిచి ఉన్నది.

సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడూ అయిన అల్లాహ్ అనంత కరుణామయుడు అనే గుణలక్షణముతో కీర్తించబడినాడు. పరమ పవిత్రుడైన అల్లాహ్ అనంత కరుణాప్రధాత, అపార కృపాశీలుడు. ఆయనే తన దాసులను కరుణిస్తాడు.

ప్రతిఫలము ఆచరణలకు తగినట్లుగా ఉంటుంది. కనుక కరుణ చూపే వారిని అల్లాహ్ కరుణించుగాక.

التصنيفات

తౌహీదె అస్మా వ సిఫాత్, సద్గుణాలు