“విశ్వాసము యొక్క సరైన మార్గాన్ని ఖచ్చితంగా అనుసరించండి; మరియు దానిపై స్థిరంగా, సాధ్యమైనంత దగ్గరగా ఉండండి. బాగా…

“విశ్వాసము యొక్క సరైన మార్గాన్ని ఖచ్చితంగా అనుసరించండి; మరియు దానిపై స్థిరంగా, సాధ్యమైనంత దగ్గరగా ఉండండి. బాగా గుర్తుంచుకోండి, (తీర్పు దినము నాడు) మీలో ఎవరూ కేవలం తన ఆచరణల ఆధారంగా రక్షించబడడు.” దానికి వారు ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్! మీరు కూడానా?” దానిని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అవును నేను కూడా, అల్లాహ్ తన కారుణ్యము మరియు అనుగ్రహముతో నన్ను కప్పివేస్తే తప్ప” అన్నారు.”

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “విశ్వాసము యొక్క సరైన మార్గాన్ని ఖచ్చితంగా అనుసరించండి; మరియు దానిపై స్థిరంగా, సాధ్యమైనంత దగ్గరగా ఉండండి. బాగా గుర్తుంచుకోండి, (తీర్పు దినము నాడు) మీలో ఎవరూ కేవలం తన ఆచరణల ఆధారంగా రక్షించబడడు.” దానికి వారు ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్! మీరు కూడానా?” దానిని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అవును నేను కూడా, అల్లాహ్ తన కారుణ్యము మరియు అనుగ్రహముతో నన్ను కప్పివేస్తే తప్ప” అన్నారు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలకు ఈ విధంగా హితబోధ చేసినారు: తమ శక్తి సామర్థ్యాల మేరకు - అల్లాహ్ పట్ల నిజాయితీతో, ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండి, సున్నత్ ను అనుసరిస్తూ సదాచరణలు చేయాలని, ఆచరణలలో హద్దుమీరడం గానీ, లేదా నిర్లక్ష్యం గానీ ఉండరాదని, వాటి ద్వారా నిర్దేశించబడిన మంచిని సాధించే సంకల్పముతో ఆచరించాలని, ఆ విధంగా వారి ఆచరణలు అల్లాహ్ వద్ద ఆమోదయోగ్యం కాగలవని, అల్లాహ్ యొక్క కరుణ, ఆయన అనుగ్రహం వారిపై అవతరించడానికి కారణం అవుతుందని హితబోధ చేసినారు. తరువాత వారికి మీలో ఎవరూ కేవలం తమ ఆచరణల ఆధారంగా (తీర్పుదినమునాడు) రక్షించబడరని, అందుకు అల్లాహ్ యొక్క కరుణ, అనుగ్రహం కూడా అవసరమని తెలియజేసినారు. సహాబాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను “మీరు కూడా రక్షించబడరా ఓ రసూలుల్లాహ్! మీ ఆచరణలు ఎంతో ఉత్తమమైనవి అయినప్పటికీ?” అని ప్రశ్నించారు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అవును, నేను కూడా, అల్లాహ్ యొక్క కరుణ, ఆయన అనుగ్రహం నన్ను కప్పివేస్తే తప్ప.”

فوائد الحديث

ఇమాం అన్’నవవీ ఇలా అన్నారు: (సద్దిదూ వ ఖారిబూ – ఋజుమార్గాన్ని ఎన్నుకొండి, మరియు దానికి దగ్గరగా ఉండండి): హదీథులో ఉన్న ఈ పదాలలో “వఖారిబూ” భావం ఏమిటంటే, (ప్రతివిషయం లోనూ అన్నివేళలా) ఋజుమార్గాన్నే ఎన్నుకోండి మరియు దానిపైననే ఉండండి. ఒకవేళ మీరు అలా చేయలేకపోతే, దానికి దగ్గరగా ఉండండి, అంటే ఋజుమార్గానికి దగ్గరగా ఉండండి. “వస్సదాద్”: భావం ఏమిటంటే, ఆచరణలలో “అతి” చేయడం లేదా ఆచరణలలో లోటు చేయడం కాకుండా మధ్యస్థంగా ఉండడమే సరియైనది. అంటే ఆచరణలలో అతివాద వైఖరిగానీ, లేదా వెనుకబడి ఉండుట గానీ చేయకండి అని.

ఇబ్న్ బాజ్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: సత్కార్యాలు స్వర్గములో ప్రవేశానికి కారణమవుతాయి. అదే విధంగా దుష్టకార్యాలు, పాపాలు, చెడుపనులు నరకంలో ప్రవేశించడానికి కారణమవుతాయి. అయితే, స్వర్గప్రవేశము కేవలం ఆచరణల ఆధారంగా మాత్రమే జరుగదని, దానికి సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క క్షమాభిక్ష, ఆయన కారుణ్యము కూడా అవసరమని ఈ హదీథు ద్వారా తెలుస్తున్నది. కనుక అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, వారికి స్వర్గప్రవేశము వారి ఆచరణల కారణంగానే లభిస్తుంది, అయితే సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క కరుణ, ఆయన అనుగ్రహము, ఆయన మన్నింపు, క్షమాభిక్ష వారి స్వర్గప్రవేశాన్ని వాజిబ్ (తప్పనిసరి) చేస్తుంది.

అల్లాహ్ యొక్క దాసుడు, తన ఆచరణలు ఎంత గొప్పవి అయినా వాటిని చూసి ప్రభావితుడు కారాదు, మోసపోరాదు. ఎందుకంటే (దాసునిపై) అల్లాహ్ యొక్క హక్కు అతని ఆచరణల కంటే గొప్పది, కనుక దాసుడు ఎల్లవేళలా భయమూ మరియు ఆశ రెండూ కలిగి ఉండాలి.

దాసులపై అల్లాహ్ యొక్క కరుణ, ఆయన అనుగ్రహం వారి ఆచరణల కంటే కూడా గొప్పవి.

సత్కర్మలు, సదాచరణలు స్వర్గములో ప్రవేశించడానికి ఒక మార్గము, అయితే దానిని సాధించడం కేవలం అల్లాహ్ యొక్క ఘనత, ఆయన కరుణ, ఆయన అనుగ్రహం ద్వారా మాత్రమే సాధ్యం.

అల్-కిర్మానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ప్రజలు అల్లాహ్ యొక్క కరుణ మరియు అనుగ్రహం ఉంటే తప్ప స్వర్గములో ప్రవేశించలేరు – ఈ విషయం మరింత ప్రస్ఫుటం ఎలా అవుతుందంటే – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాగూ స్వర్గములో ప్రవేశిస్తారు, అందులో సందేహం ఏమాత్రమూ లేదు; అయినా ఆయనను గురించి ఈ హదీథు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అల్లాహ్ యొక్క కరుణ, ఆయన అనుగ్రహం లేనిదే ప్రవేశించలేరు అంటున్నపుడు మరి మిగతా వారి విషయంలో ఇది మరింతగా వర్తిస్తుంది.

ఇమాం అన్’నవవీ (రహిమహుల్లాహ్) ఖుర్’ఆన్’లో అల్లాహ్ యొక్క ప్రకటనల అర్థాలకు సంబంధించి ఇలా అన్నారు: [మీరు చేసిన మంచి పనులకు ప్రతిఫలంగా స్వర్గంలో ప్రవేశించండి!] (సూరహ్ అన్’నహ్ల్ 16:32); మరియు [మరియు మీరు చేస్తూ ఉన్న కర్మల ఫలితానికి బదులుగా మీరు ఈ స్వర్గానికి వారసులయ్యారు.] (సూరహ్ అజ్’జుఖ్’రుఫ్ 43:72) “సత్కార్యాలు స్వర్గములో ప్రవేశించడానికి దారితీస్తాయి” అని తెలిపే ఇటువంటి ఇతర ఆయతులు, ప్రస్తుతం మనముందున్న ఇటువంటి హదీథులతో ఏమాత్రమూ విభేధించవు. ఎందుకంటే పైన తెలిపినటువంటి ఆయతులలోని ఆచరణలు స్వర్గములో ప్రవేశించడానికి సాధనాలు అవుతాయి అని తెలుపుతున్నాయి, అయితే ఆ ఆచరణలకు మార్గదర్శకం, ఆచరించుటలో కేవలం అల్లాహ్ కొరకే అనే నిజాయితీ మరియు ఆ అచరణల స్వీకరణ అనేవి కేవలం అల్లాహ్ యొక్క కరుణతో మాత్రమే ఒక వ్యక్తి పొందగలడు. కనుక ఒక వ్యక్తి తన ఆచరణల ద్వారా మాత్రమే స్వర్గములోనికి ప్రవేశించలేడు అని ఈ హదీథులో సూచించబడిన విషయం వాస్తవమని ఋజువవుతున్నది; అలాగే అతడు తన ఆచరణల ద్వారా స్వర్గములోని ప్రవేశిస్తాడు అనే మాట కూడా వాస్తవమే అది అల్లాహ్ యొక్క కరుణకు సంకేతం.

ఇబ్న్ అల్-జౌజీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఇందులో నాలుగు విషయాలు తెలుస్తున్నాయి. మొదటిది: మంచి పనులు చేయడానికి మార్గదర్శకత్వం అల్లాహ్ యొక్క కరుణ ద్వారా మాత్రమే లభిస్తుంది. మానవునిపై అల్లాహ్ యొక్క ముందస్తు కరుణ, అనుగ్రహం లేకపొయినట్లయితే అతడు విశ్వాసాన్ని, విధేయతను పొందేవాడు కాదు, తద్వారా అతడు మోక్షానికి కూడా అర్హుడు కాలేకపోయేవాడు; రెండవది: దాసుని యొక్క ప్రయోజనాలన్నీ అతని యజమాని కొరకే, కనుక అతని కర్మలన్నీ అతని ప్రభువుకే చెందుతాయి. కనుక అతని ప్రభువు అతనికి ప్రసాదించే ప్రతిఫలం, అది ఎంత ఘనమైన ప్రతిఫలం అయినా, అది కేవలం అతని ప్రభువు యొక్క అనుగ్రహాన్ని సూచిస్తుంది. మూడవది: స్వర్గంలోకి ప్రవేశించడం అనేది అల్లాహ్ యొక్క దయ వల్ల, ఆయన యొక్క కృప వల్లనే అని కొన్ని హదీథులలో ప్రస్తావించబడింది, కాని స్వర్గములో ఎవరికి ఏ స్థాయి ప్రాప్తమవుతుంది అనే నిర్ణయం అతడి ఆచరణలపై ఆధారపడి ఉంటుంది. నాల్గవది: విధేయతకు సంబంధించిన ఆచరణలు ఆచరించడానికి ఎక్కువ సమయం పట్టదు, కానీ దాని ప్రతిఫలం అంతు లేనిది. కాబట్టి, తాత్కాలికమైన ఆచరణలకు బదులుగా, శాశ్వతమైన మరియు అంతులేని ప్రతిఫలం ఇవ్వబడినప్పుడు, అది ఆ వ్యక్తికి అతని ఆచరణలకు పరిహారం ఇవ్వబడడాన్ని గాక, అల్లాహ్ యొక్క కరుణను, దయను, అనుగ్రహాన్ని సూచిస్తుంది.

అల్-రాఫి’యీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: మోక్షాన్ని మరియు స్వర్గములో ఉత్తమ స్థాయిని కోరుకునే వ్యక్తి ఎవరైనా తన ఆచరణలపై ఏమాత్రమూ ఆధారపడరాదు; ఎందుకంటే అతను అల్లాహ్ యొక్క సహాయంతో మాత్రమే ఆ ఆచరణలు చేసినాడు మరియు అతను పాపాలను అల్లాహ్ యొక్క రక్షణతో మాత్రమే విడిచిపెట్టాడు, కాబట్టి ఇవన్నీ ఆయన దయ, కరుణ మరియు అనుగ్రహం ద్వారా మాత్రమే సాధ్యమయ్యాయి.

التصنيفات

తౌహీదె అస్మా వ సిఫాత్