అతడిని ఈ భూమి మీద కాళ్ళపై నడిచేలా చేయగలిగిన శక్తిమంతుడు (అయిన అల్లాహ్), తీర్పు దినమున అతడిని ముఖముపై నడిచేలా…

అతడిని ఈ భూమి మీద కాళ్ళపై నడిచేలా చేయగలిగిన శక్తిమంతుడు (అయిన అల్లాహ్), తీర్పు దినమున అతడిని ముఖముపై నడిచేలా చేయలేడా?

ఖతాదహ్ రహిమహుల్లాహ్ ఉల్లేఖనం : “అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు మాతో ఇలా అన్నారు: “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాడు “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం ! తీర్పు దినమున అవిశ్వాసి తన ముఖము పై (నడిచేలా) ఎలా సమీకరించబడతాడు?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ అతడిని ఈ భూమి మీద కాళ్ళపై నడిచేలా చేయగలిగిన శక్తిమంతుడు (అయిన అల్లాహ్), తీర్పు దినమున అతడిని ముఖముపై నడిచేలా చేయలేడా?” అన్నారు. ఖతాదహ్ ఇలా అన్నారు “అవును, మా ప్రభువు (అయిన అల్లాహ్) గౌరవం సాక్షిగా (ఆయన అలా చేయగల శక్తిశాలి)”.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడగడం జరిగింది “తీర్పు దినము నాడు అవిశ్వాసిని (అవిశ్వాసులను) అతని ముఖం పై (నడిచేలా) ఎలా సమీకరించబడతాడు? అని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అతడిని ఈ ప్రపంచములో రెండు కాళ్ళపై నడిచేలా చేయగలిగిన అల్లాహ్, తీర్పు దినమున అతని ముఖం పై నడిచేలా చేయలేడా?” అన్నారు. అల్లాహ్ అన్నీ చేయగల సమర్థుడు.

فوائد الحديث

ఈ హదీసు ద్వారా తీర్పు దినము నాడు అవిశ్వాసి అవమానం పాలు అవుతాడని, మరియు అతడు తన ముఖం పై నడుస్తాడని తెలుస్తున్నది.

التصنيفات

అంతిమ దినంపై విశ్వాసం., తౌహీదె రుబూబియ్యత్, తౌహీదె అస్మా వ సిఫాత్