“ప్రజలలో అత్యంత నీచులు, దుష్టులు ఎవరంటే, వారు జీవించి ఉండగానే ప్రళయఘడియ వచ్చి పడుతుంది, మరియు ఎవరైతే సమాధులను…

“ప్రజలలో అత్యంత నీచులు, దుష్టులు ఎవరంటే, వారు జీవించి ఉండగానే ప్రళయఘడియ వచ్చి పడుతుంది, మరియు ఎవరైతే సమాధులను తమ ఆరాధనా గృహాలుగా (మస్జిదులుగా) చేసుకున్నారో.”

అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖన, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ప్రజలలో అత్యంత నీచులు, దుష్టులు ఎవరంటే, వారు జీవించి ఉండగానే ప్రళయఘడియ వచ్చి పడుతుంది, మరియు ఎవరైతే సమాధులను తమ ఆరాధనా గృహాలుగా (మస్జిదులుగా) చేసుకున్నారో.”

[ప్రామాణికమైనది] [దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అత్యంత నీచులు, దుష్టులను గురించి ఇలా తెలియజేస్తున్నారు: వారు జీవించి ఉండగానే ప్రళయఘడియ వచ్చి పడుతుంది; మరియు ఎవరైతే సమాధులను మస్జిదులుగా చేసుకున్నారో, అంటే వారు సమాధుల వద్ద తమ నమాజులను ఆచరిస్తారు, మరియు వాటి వైపునకు తిరిగి నమాజులను ఆచరిస్తారు.

فوائد الحديث

ఇందులో సమాధులపై మస్జిదులను నిర్మించుట నిషేధం అని తెలుస్తున్నది. ఎందుకంటే అది బహుదైవారాధనకు దారి తీసే మూలకారణాలలో ఒకటి.

సమాధులపై మస్జిదులు నిర్మించకపోయినా, అక్కడ నమాజులను ఆచరించుట నిషేధము, ఎందుకంటే మస్జిదు అంటే ఒక నిర్మాణం పేరు కాదు. నిర్మాణం ఏమీ లేకపోయినా, అల్లాహ్ కు సజ్దాలు ఆచరించబడే ప్రతి స్థలం కూడా మస్జిదే.

ఎవరైతే గతించిన ప్రవక్తల సమాధులను, లేక తమ పుణ్యపురుషుల సమాధులను మస్జిదులుగా చేసుకుని అక్కడ నమాజులను ఆచరిస్తాడో, వాడు ఈ సృష్టి మొత్తములో అత్యంత నీచుడు, దుష్టుడు; అతడు “నా సంకల్పము పుణ్యపురుషులను ఆరాధించుట కాదు, కేవలం అల్లాహ్ యొక్క సామీప్యానికి చేరుకొనుటయే” అని ఎంతగా దావా చేసినప్పటికీ.

التصنيفات

ప్రళయ సూచనలు.