“జాగ్రత్త! రాబోయే కాలంలో ఒక వ్యక్తికి నా హదీసు చేరుతుంది. అతడు తన పడక మీద జారగిలబడి కూర్చుని ఇలా అంటాడు “మీకూ…

“జాగ్రత్త! రాబోయే కాలంలో ఒక వ్యక్తికి నా హదీసు చేరుతుంది. అతడు తన పడక మీద జారగిలబడి కూర్చుని ఇలా అంటాడు “మీకూ మాకూ మధ్యన అల్లాహ్ గ్రంథం ఉన్నది

మిఖ్'దాం బిన్ మ’అదీ కరిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు : “జాగ్రత్త! రాబోయే కాలంలో ఒక వ్యక్తికి నా హదీసు చేరుతుంది. అతడు తన పడక మీద జారగిలబడి కూర్చుని ఇలా అంటాడు “మీకూ మాకూ మధ్యన అల్లాహ్ గ్రంథం ఉన్నది. అందులో హలాల్ గా ప్రకటించ బడినదంతా మేము హలాల్ గా భావిస్తాము మరియు అందులో హరాంగా ప్రకటించ బడినదంతా మేము హరాం గా భావిస్తాము”. (ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు) “జాగ్రత్త! అల్లాహ్ యొక్క సందేశహరుడు దేనినైతే హరాంగా ప్రకటించినాడో, అది అల్లాహ్ హరాంగా ప్రకటించిన దానితో సమానం”.

[దృఢమైనది]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: సమీప భవిష్యత్తులో ఇలాంటి ఒక కాలం రాబోతున్నది. అందులో – కొంత మంది ప్రజలు కూర్చుని ఉంటారు, ఒకడు తన పడక మీద జారగిలబడి కూర్చుని ఉంటాడు. అతనికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక హదీసు తెలియజేయబడుతుంది. దానికి అతడు ఇలా అంటాడు “మీకూ మాకూ మధ్య తీర్పు చెప్పేది ఏదైనా ఉంది అంటే అది ‘అల్ ఖుర్’ఆన్ అల్ కరీం’. అది చాలు మాకు. అందులో మాకు ఆచరించవలసిన విషయాలుగా (హలాల్ విషయాలుగా) కనిపించిన అంతటిపై మేము ఆచరిస్తాము, మరియు అందులో నిషేధించబడిన విషయాలుగా (హరాం విషయాలుగా) కనిపించిన దానినుండి దూరంగా ఉంటాము. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించినారు – తన సున్నత్’లో తాను నిషేధించిన ఏ విషయమైనా లేదా తాను నిరోధించిన ఏ విషయమైనా, అది అల్లాహ్ తన గ్రంథములో నిషేధిస్తూ ఆదేశించిన దానితో సమానం. ఎందుకంటే ప్రతిదీ తాను తన ప్రభువు నుండే అంద జేస్తున్నాడు గనుక.

فوائد الحديث

ఇందులో ఖుర్’ఆన్ ను ఏ విధంగానైతే గౌరవిస్తామో మరియు స్వీకరిస్తామో, అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్’లను కూడా గౌరవించాలి, స్వీకరించాలి అనే ఉద్బోధ ఉన్నది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు విధేయత చూపడం, అల్లాహ్’కు విధేయత చూపడమవుతుంది, అలాగే ఆయను అవిధేయత చూపడం అల్లాహ్’కు అవిధేయత చూపడమవుతుంది.

ఈ హదీసు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ యొక్క ప్రామాణికతకు సంబంధించి ఒక నిదర్శనం. మరియు ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్’లను, వారి హదీసులను తోసిపుచ్చుతారో మరియు నిరాకరిస్తారో వారికి ఇందులో ఒక హెచ్చరిక ఉన్నది.

ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ ను నిరాకరిస్తారో వారు ‘మురిజున్’ (సందేశాన్ని తిరస్కరించినవారు) గా పరిగణించబడతారు. మరియు ‘మేము ఖుర్’ఆన్ ను అనుసరిస్తున్నాము’ అని వారు చేసే దావా ఒట్టి అబద్ధం.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవక్తత్వానికి ఈ హదీసు ఒక నిదర్శనం. ఇందులో ఆయన భవిశ్యత్తులో జరుగబోయే దానిని గురించి చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే ఈనాడు జరుగుతున్నది కూడా.

التصنيفات

సున్నత్ ప్రాముఖ్యత మరియు దాని స్థానం., దైవదౌత్యం (నుబువ్వత్), బర్జఖ్ జీవితం