“అంతిమ ఘడియ అప్పటివరకూ స్థాపించబడదు – (ఏదైనా) సమాధి ప్రక్క నుండి వెళుతున్న వ్యక్తి (సమాధిని చూసి) “అతని…

“అంతిమ ఘడియ అప్పటివరకూ స్థాపించబడదు – (ఏదైనా) సమాధి ప్రక్క నుండి వెళుతున్న వ్యక్తి (సమాధిని చూసి) “అతని స్థానములో నేను ఉంటే ఎంత బాగుండును!” అని పలికే వరకు

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అంతిమ ఘడియ అప్పటివరకూ స్థాపించబడదు – (ఏదైనా) సమాధి ప్రక్క నుండి వెళుతున్న వ్యక్తి (సమాధిని చూసి) “అతని స్థానములో నేను ఉంటే ఎంత బాగుండును!” అని పలికే వరకు.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: "ఏదైనా ఒక సమాధి ప్రక్క నుండి వెళుతున్న వ్యక్తి, ఆ సమాధిని చూస్తూ అతడి స్థానములో తానుంటే ఎంత బాగుండును అని అనుకునేటంత వరకూ అంతిమ ఘడియ స్థాపించబడదు". ఆ వ్యక్తి అలా ఎందుకు అనుకుంటాడూ అంటే ప్రపంచములో అసత్యము మరియు దాని జనులు బాగా ప్రబలిపోవడం, ప్రలోభాలూ, దురాకర్షణలూ, పాపాలు మరియు దుర్మార్గమూ, అరాచకత్వమూ బాగా ప్రబలిపోయి, తన(లో) ధర్మము ఎక్కడ బలహీనపడిపోతుందో అనే భయంతో అతడు అలా అనుకుంటాడు.

فوائد الحديث

ఈ హదీసులో – ఈ ప్రపంచపు ఆఖరి దినములలో ప్రలోభాలూ, దురాకర్షణలూ, పాపాలు మరియు దుర్మార్గమూ, అరాచకత్వమూ మొదలైనవి మిక్కిలిగా పుట్టుకొస్తాయనే సూచన ఉన్నది.

ఇందులో (ఇస్లాంలో) సంపూర్ణ విశ్వాసము కలిగి ఉండుట ద్వారా మరియు ఎక్కువగా సత్కార్యములు చేయుట ద్వారా మరణము కొరకు తయారు కావాలని, మరియు ప్రలోభాలూ, దురాకర్షణలూ, పాపాలు మరియు దుర్మార్గమూ మొదలైన వాటి నుండి, అటువంటి ప్రదేశాల నుండి దూరంగా ఉండాలనే హితబోధ ఉన్నది.

التصنيفات

బర్జఖ్ జీవితం, పుణ్యాత్ముల స్థితులు, మనస్సుల పరిశుద్ధత