'నీవు కోరుకున్నది నీకు ఇవ్వబడింది, అదనంగా దానికి సమానమైనంత కూడా ఇవ్వబడింది.'

'నీవు కోరుకున్నది నీకు ఇవ్వబడింది, అదనంగా దానికి సమానమైనంత కూడా ఇవ్వబడింది.'

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "నిశ్చయంగా, స్వర్గంలో మీలో ఒకరికి లభించే అత్యల్ప స్థానం ఏమిటంటే, అల్లాహ్ అతనితో 'కోరుకో' అంటాడు: అతను కోరుకుంటాడు. మళ్లీ కోరుకుంటాడు. అప్పుడు అల్లాహ్ అతన్ని అడుగుతాడు: 'నీవు కోరుకున్నావా?' అతను 'అవును' అని జవాబిస్తాడు. అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు: 'నీవు కోరుకున్నది నీకు ఇవ్వబడింది, అదనంగా దానికి సమానమైనంత కూడా ఇవ్వబడింది.'"

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: స్వర్గంలో ప్రవేశించిన వ్యక్తికి లభించే అత్యల్ప (అతి తక్కువ) స్థానం ఏమిటంటే, అతనితో (అల్లాహ్) 'కోరుకో' అని అంటాడు. అతను కోరుకుంటాడు, మళ్లీ కోరుకుంటాడు, తన కోరికలలో ఏదీ మిగిలి పోకుండా అన్నింటినీ కోరుకుంటాడు. అప్పుడు అతనితో 'నువ్వు కోరుకున్నావా?' అని అల్లాహ్ అడుగుతాడు. అతను 'అవును' అని జవాబిస్తాడు. అప్పుడు అల్లాహ్ 'నీవు కోరుకున్నది నీకు ఇవ్వబడింది, దానికి సమానమైనది కూడా నీకు ఇవ్వబడింది' అని అంటాడు."

فوائد الحديث

స్వర్గవాసుల గృహాలలో (స్థాయిలలో) భేదం.

"అల్లాహ్ సుబహానహు వ తాఆలా యొక్క గొప్ప దానశీలత వివరణ."

స్వర్గ సుఖాలు ఏదో ఒక్క విషయానికే పరిమితమైవి కావు, బదులుగా విశ్వాసి అక్కడ తన మనసు కోరిన ప్రతి వస్తువును, ప్రతి కోరికను పొందుతాడు. ఇదంతా మహోన్నతుడైన అల్లాహ్ యొక్క అపారమైన కృప, దానశీలత మరియు ఔదార్యం వలన సాధ్యమవుతుంది.

التصنيفات

పరలోక జీవితం, స్వర్గము,నరకము యొక్క లక్షణాలు