పరలోక జీవితం

పరలోక జీవితం

5- “పునరుత్థాన దినము నాడు, కొన్ని విషయాలను గురించి ప్రశ్నించనంత వరకు, మానవుడి కాళ్ళు అతడు నిలుచుని ఉన్నచోటు నుండి ఏమాత్రమూ కదలవు – అతడి జీవితాన్ని గురించి – అతడు దానిని ఎందులో గడిపినాడు అని; అతడి జ్ఞానాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా ఉపయోగించినాడు అని; అతడి సంపదను గురించి – ఎక్కడి నుండి సంపాదించినాడు అని, మరియు దానిని ఎక్కడ ఖర్చు చేసినాడు అని; మరియు అతడి శరీరాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా పరిసమాప్తి గావించినాడు (ఏ విధంగా ఉపయోగించినాడు) అని

8- “ఎవరైతే అజాన్ (నమాజు కొరకు ఇవ్వబడే పిలుపు) విన్న తరువాత ఈ పలుకులు “అల్లాహుమ్మ, రబ్బహాదిహిద్ద’వతిత్తామ్మహ్, వస్సలాతిల్ ఖాఇమహ్, ఆతి ముహమ్మదన్ అల్’వసీలత, వల్ ఫజీలత, వబ్’అథ్’హు మఖామన్ మహ్’మూదన్ అల్లదీ వ అద్’తహు” (ఓ అల్లాహ్! ఈ పరిపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడబోయే ఈ నిత్య నమాజు పిలుపునకు ఓ ప్రభువా! దయచేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు (తీర్పు దినమున) స్వర్గంలో ఆయనకు తప్ప మరెవరికీ లభించని అత్యున్నత స్థానమును మరియు ఆధిక్యతను ప్రసాదించు, మరియు (తీర్పు దినమున) నీవు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు వాగ్దానం చేసిన స్వర్గంలో శ్రేష్ఠమైన మరియు మరియు అత్యున్నతమైన స్థానానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను పంపు) అని పలుకుతాడో తీర్పు దినమున అతనికి నా మధ్యవర్తిత్వం ఖచ్చితంగా లభిస్తుంది