إعدادات العرض
కాబట్టి మీరు అల్లాహ్‌ను ఏదైనా అడిగినప్పుడు, ఆయనతో ఫిర్'దౌస్ స్వర్గాన్ని ప్రసాదించమని వేడుకోండి
కాబట్టి మీరు అల్లాహ్‌ను ఏదైనా అడిగినప్పుడు, ఆయనతో ఫిర్'దౌస్ స్వర్గాన్ని ప్రసాదించమని వేడుకోండి
ఉబాదహ్ బిన్ సాబిత్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలూల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "స్వర్గంలో వంద స్థాయిలు ఉంటాయి, ప్రతి రెండు స్థాయిల మధ్య ఆకాశం మరియు భూమి మధ్య దూరం అంత ఉంది. ఫిర్'దౌసు స్వర్గం అత్యున్నత స్థాయి స్వర్గం, మరియు దాని నుండి స్వర్గం యొక్క నాలుగు నదులు ఉద్భవిస్తాయి మరియు దాని పైనే అర్ష్ సింహాసనం ఉంది. కాబట్టి మీరు అల్లాహ్‌ను ఏదైనా అడిగినప్పుడు, ఆయనతో ఫిర్'దౌస్ స్వర్గాన్ని ప్రసాదించమని వేడుకోండి."
الترجمة
العربية Tiếng Việt অসমীয়া Nederlands Indonesia Kiswahili Hausa සිංහල English ગુજરાતી Magyar ქართული Română Русский Português ไทย मराठी دری Türkçe አማርኛ বাংলা Kurdî Malagasy Македонски Tagalog ភាសាខ្មែរ Українська ਪੰਜਾਬੀ پښتو Moore Wolof മലയാളം Svenskaالشرح
స్వర్గంలో వంద స్థాయిలు మరియు హోదాలు ఉన్నాయని ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తెలిపినారు, ప్రతి రెండు స్థాయిల మధ్య దూరం స్వర్గం మరియు భూమి మధ్య దూరం అంత ఉంది. ఈ స్వర్గాలలో అత్యున్నతమైనది ఫిర్దౌస్ స్వర్గం, దాని నుండి స్వర్గంలోని నాలుగు నదులు ప్రవహిస్తాయి మరియు ఫిర్దౌస్ పైనే అర్ష్ సింహాసనం ఉంది. కాబట్టి మీరు అల్లాహ్ ను ఏదైనా అడిగితే, మొత్తం స్వర్గాలలో అన్నింటికంటే పైన ఉన్న ఫిర్దౌస్ స్వర్గం కోసం అడగండి.فوائد الحديث
స్వర్గవాసులు ప్రపంచంలోని వారి విశ్వాసం మరియు మంచి పనుల ప్రకారం విభిన్న స్థాయిలలోని వారి నివాసాలలో ఉంటారు.
ఈ హదీథు ప్రజలను అత్యున్నత స్థాయి స్వర్గం కోసం అల్లాహ్ ను అడగమని ప్రోత్సహిస్తున్నది.
అల్ ఫిర్'దౌసు స్వర్గాలన్నింటిలో అత్యుత్తమమైనది మరియు చాలా గొప్పది.
ఒక ముస్లిం ఉన్నత ఆకాంక్షలను కలిగి ఉండాలి మరియు అల్లాహ్ వద్ద అత్యున్నతమైన స్థానాన్ని మరియు హోదాను పొందడానికి కృషి చేయాలి.
స్వర్గంలోని నాలుగు నదులు అంటే ఖుర్ఆన్‌లో ప్రస్తావించబడిన నీరు, పాలు, స్వర్గపానీయం మరియు తేనె నదులు. సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రకటన: “నీతిమంతులకు వాగ్దానం చేయబడిన స్వర్గం యొక్క వివరణ ఏమిటంటే, అక్కడ మార్పులేని నీటి నదులు, రుచి ఎన్నటికీ మారని పాల నదులు, త్రాగేవారికి రుచికరమైన స్వర్గపానీయపు నదులు మరియు స్వచ్ఛమైన తేనె నదులు ఉన్నాయి.” [ముహమ్మద్:15]
