“ఎవరైతే, (పేదరికం కారణంగా) తీసుకున్న అప్పు తీర్చలేక పోతున్న వానికి వ్యవధినిస్తాడో లేదా ఎవరైతే అతని అప్పులో…

“ఎవరైతే, (పేదరికం కారణంగా) తీసుకున్న అప్పు తీర్చలేక పోతున్న వానికి వ్యవధినిస్తాడో లేదా ఎవరైతే అతని అప్పులో కొంత భాగాన్ని తగ్గిస్తాడో, అతడికి అల్లాహ్ తన నీడ తప్ప మరింకే నీడ ఉండని ఆ తీర్పు దినమున తన అర్ష్ (సింహాసనము) క్రింద నీడ కల్పిస్తాడు”

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే, (పేదరికం కారణంగా) తీసుకున్న అప్పు తీర్చలేక పోతున్న వానికి వ్యవధినిస్తాడో లేదా ఎవరైతే అతని అప్పులో కొంత భాగాన్ని తగ్గిస్తాడో, అతడికి అల్లాహ్ తన నీడ తప్ప మరింకే నీడ ఉండని ఆ తీర్పు దినమున తన అర్ష్ (సింహాసనము) క్రింద నీడ కల్పిస్తాడు”.

[దృఢమైనది] [దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరైతే (పేదరికం కారణంగా) తీసుకున్న అప్పు తీర్చలేక బాధపడుతున్న వానికి తగినంత సమయాన్ని ఇస్తాడో లేదా అతడి అప్పు నుండి కొంత భారాన్ని తగ్గిస్తాడో, అటువంటి వాని ప్రతిఫలాన్ని గురించి తెలియజేస్తున్నారు: తీర్పు దినము నాడు, సూర్యుడు తన పూర్తి ప్రతాపముతో ప్రకాశిస్తూ, అల్లాహ్ యొక్క దాసుల తలలను తాకేటంత క్రిందకు వస్తాడు, ఆ వేడికి వారంతా తల్లడిల్లి పోతుంటారు. ఏ నీడా అందుబాటులో లేని అటువంటి కఠినమైన సమయాన, అల్లాహ్ అతడికి తన సింహాసనము క్రింద నీడను ప్రసాదిస్తాడు. కనుక, అల్లాహ్ ఎవరికైతే నీడను ప్రసాదిస్తాడో, వారికి తప్ప ఇంకెవ్వరికీ ఆనాడు నీడ దొరకదు.

فوائد الحديث

అల్లాహ్ దాసులు కష్టాలలో ఉన్నపుడు వారికి సౌలభ్యం కలిగేలా సహకరించడం అనేది తీర్పు దినము నాటి భయానక పరిస్థితుల నుండి రక్షణ, ముక్తి పొందటము యొక్క ఘనత

ప్రతిఫలం ఆచరణ యొక్క విధానాన్ని బట్టి ఉంటుంది.

التصنيفات

పరలోక జీవితం