“పునరుత్థాన దినమున తీర్పు చేయబడే మొదటి విషయం – అక్రమంగా చిందించబడిన రక్తము” (అన్యాయంగా, అధర్మంగా ఎవరినైనా…

“పునరుత్థాన దినమున తీర్పు చేయబడే మొదటి విషయం – అక్రమంగా చిందించబడిన రక్తము” (అన్యాయంగా, అధర్మంగా ఎవరినైనా చంపడం, హత్య చేయడం.)

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “పునరుత్థాన దినమున తీర్పు చేయబడే మొదటి విషయం – అక్రమంగా చిందించబడిన రక్తము” (అన్యాయంగా, అధర్మంగా ఎవరినైనా చంపడం, హత్య చేయడం.)

[దృఢమైనది] [ముత్తఫఖున్ అలైహి మరియు పదాలు ముస్లింవి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు: పునరుత్థాన దినమున ప్రజల మధ్య తీర్పు చేయబడే మొదటి విషయం – అన్యాయంగా, అధర్మంగా ఒకరిపై మరొకరు చేసిన రక్తపాతం. అంటే అన్యాయంగా, అధర్మంగా ఒకరి ప్రాణం తీయడం, లేదా గాయపరచడం మొదలైనవి.

فوائد الحديث

రక్తము చిందించడం చాలా పెద్ద విషయం. ఎవరు మొదలు పెట్టినారు/ఎలా మొదలైంది అనేది ముఖ్యం.

పాపాలు అవి కలిగించే నష్టము, విధ్వంసము కారణంగా వాటి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఒక అమాయకుని ప్రాణం తీయడం అటువంటి విధ్వంస కరమైన పాపాలలో అత్యంత తీవ్రమైనది. దానికంటే తీవ్రమైన పాపం మరొకటి లేదు – అల్లాహ్ తో షిర్క్ చేయడం తప్ప (షిర్క్: అల్లాహ్ కు సాటిగా, సమానులుగా మరొకరిని నిలబెట్టడం).

التصنيفات

పరలోక జీవితం, ఖిసాస్ (ప్రతీకార న్యాయం)