“(తీర్పు దినమున) మృత్యువు నల్లని తల, తెల్లని శరీరం కలిగిన ఒక గొర్రెపోతు రూపంలో తీసుకు రాబడుతుంది

“(తీర్పు దినమున) మృత్యువు నల్లని తల, తెల్లని శరీరం కలిగిన ఒక గొర్రెపోతు రూపంలో తీసుకు రాబడుతుంది

అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(తీర్పు దినమున) మృత్యువు నల్లని తల, తెల్లని శరీరం కలిగిన ఒక గొర్రెపోతు రూపంలో తీసుకు రాబడుతుంది. అపుడు పిలుపునిచ్చు వాడొకడు ఎలుగెత్తి “ఓ స్వర్గవాసులారా!” అని పిలుపునిస్తాడు. అపుడు వారు తమ మెడలను సారించి అతని వైపునకు జాగ్రత్తగా చూస్తారు. అతడు “ఇదేమిటో మీకు తెలుసా?” అని వారిని అడుగుతాడు. దానికి వారు “తెలుసు, అది మృత్యువు” అంటారు, ఎందుకంటే, నిశ్చయంగా దానిని వారు ముందే చూసి ఉన్నారు కనుక. అపుడు తిరిగి పిలుపు ఇవ్వబడుతుంది “ఓ నరకవాసులారా!”. దానితో వారు తమ మెడలను సారించి అతని వైపునకు జాగ్రత్తగా చూస్తారు. అతడు “ఇదేమిటో మీకు తెలుసా?” అని వారిని అడుగుతాడు. దానికి వారు “తెలుసు, అది మృత్యువు” అంటారు, ఎందుకంటే, నిశ్చయంగా దానిని వారు ముందే చూసి ఉన్నారు కనుక. అపుడు దానిని (గొర్రెపోతు రూపములో ఉన్న మృత్యువును) జిబహ్ చేయుట జరుగుతుంది. అపుడు ఆ పిలిచేవాడు ఇలా అంటాడు “ఓ స్వర్గవాసులారా! మీకు ఇది (స్వర్గము) శాశ్వతము, మరియు (మీకు) మృత్యువు లేదు; ఓ నరకవాసులారా! మీకు ఇది (నరకము) శాశ్వతము, మరియు మీకు మృత్యువు లేదు.” తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు “ {وَأَنْذِرْهُمْ يَوْمَ الحَسْرَةِ إِذْ قُضِيَ الأَمْرُ وَهُمْ فِي غَفْلَةٍ} (సూరహ్ మర్యం:39) (మరియు వారిని (రాబోయే) ఆ పశ్చాత్తాప పడవలసిన దినాన్ని గురించి హెచ్చరించు. అప్పుడు పరిణామం నిర్ణయించబడి ఉంటుంది. (ఇప్పుడైతే) వారు ఏమరుపాటులో పడి ఉన్నారు....”) అని ఇంతవరకు పఠించి “(అవును) ఈ ప్రాపంచిక జీవితములో పడి కొట్టుకు పోతున్నవారు ఏమరపాటులో పడి ఉన్నారు” అన్నారు. తరువాత ఆ ఆయతు చివరి భాగము (وَهُمْ لاَ يُؤْمِنُونَ) (కావున వారు విశ్వసించడం లేదు) (సూరహ్ మర్యం:39) పఠించి పూర్తి చేసినారు.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – తీర్పు దినము నాడు మృత్యువు ఒక గొర్రెపోతు రూపములో ముందుకు తీసుకు రాబడుతుంది అని, అది నలుపు, తెలుపు రంగులలో ఉంటుంది – అని తెలియ జేస్తున్నారు. అపుడు “ఓ స్వర్గవాసులారా!” అను ఎలుగెత్తి పిలువ బడుతుంది. వారు తమ తలలు పైకెత్తి, మెడలను సారించి అటువైపునకు చూస్తారు. (ఆ పిలిచిన వాడు మృత్యువును చూపిస్తూ) “ఇదేమిటో మీకు తెలుసా?” అని ప్రశ్నిస్తాడు. దానికి వారు “అవును, తెలుసు, అది మృత్యువు” అంటారు, ఎందుకంటే వారు అందరూ దానిని (అంతకు ముందు) చూసినవారే, దానిని ఎరిగినవారే. అపుడు ఆ పిలిచేవాడు “ఓ నరకవాసులారా!” అని పిలుస్తాడు. వారు తమ తలలు పైకెత్తి, మెడలను సారించి అటువైపునకు చూస్తారు. అతడు “ఇదేమిటో మీకు తెలుసా?” అని ప్రశ్నిస్తాడు. దానికి వారు “అవును, తెలుసు, అది మృత్యువు” అంటారు, ఎందుకంటే వారు అందరూ దానిని (అంతకు ముందు) చూసినవారే, దానిని ఎరిగినవారే. అపుడు దానిని (మృత్యువును) జిబహ్ చేయడం జరుగుతుంది. ఆ పిలిచేవాడు ఎలుగెత్తి ఇలా అంటాడు “ఓ స్వర్గవాసులారా! ఇది (ఈ స్వర్గ నివాసము) మీకు శాశ్వతం, శాశ్వతం, మీకింక చావు లేదు; “ఓ నరకవాసులారా! ఇది (ఈ నరక నివాసము) మీకు శాశ్వతం, శాశ్వతం, మీకింక చావు లేదు”. ఇది స్వర్గ నివాసుల శుభాలలో (అల్లాహ్ తరఫు నుండి) అపారమైన వృద్ధి, అలాగే నరకవాసుల శిక్షలో అపారమైన కాఠిన్యాన్ని గురించి తెలుపు తున్నది. ఆ తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ నుండి ఆయతును పఠించినారు. “మరియు వారిని (రాబోయే) ఆ పశ్చాత్తాప పడవలసిన దినాన్ని గురించి హెచ్చరించు. అప్పుడు పరిణామం నిర్ణయించబడి ఉంటుంది. (ఇప్పుడైతే) వారు ఏమరుపాటులో పడి ఉన్నారు, కావున వారు విశ్వసించడం లేదు”. ఈ హదీసు ద్వారా – తీర్పు దినము నాడు (ప్రజలు వారి వారి కర్మలను అనుసరించి) స్వర్గవాసులు, నరకవాసులుగా విభజించబడతారు. ప్రతి ఒక్కరూ తమకు ప్రాప్తమైన దాని లోనికి శాశ్వతంగా ప్రవేశిస్తారు. (ఆ దినము) పాపకార్యములు చేసిన వాడు (తాను ఆ కార్యములకు పాల్బడకుండ ఉంటే ఎంత బాగుండును) అని పశ్చాత్తాప పడతాడు, సిగ్గు పడతాడు, కానీ అది ఏమీ అతనికి మంచిని కలుగ జేయదు, అతని శిక్షను ఏమీ తగ్గించదు.

فوائد الحديث

మనిషి యొక్క భవిత అతని మరణానంతర జీవితములో స్వర్గము గానీ లేక నరకము గానీ అతని శాశ్వత నివాసం అవుతుంది.

తీర్పు దినము నాటి భయానక పరిణామం పట్ల ఇందులో ఒక హెచ్చరిక ఉన్నది. తీర్పు దినము “ఇలా చేయక పోతే బాగుండును” అనే హృదయ విదారకమైన పశ్చాత్తాపము, సిగ్గు పడేలా చేసే దినమై ఉంటుంది.

ఇందులో, స్వర్గవాసుల కొరకు శాశ్వత సుఖాలు, సంతోషాలు, సౌఖ్యాలు ఉంటాయని, నరకవాసుల కొరకు శాశ్వత శిక్షలు, బాధలు, ఉంటాయనే ఉద్బోధ ఉన్నది.

التصنيفات

అంతిమ దినంపై విశ్వాసం., స్వర్గము,నరకము యొక్క లక్షణాలు, ఆయతుల తఫ్సీర్