إعدادات العرض
ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రళయ ఘడియను గురించి ప్రశ్నిస్తూ, ఇలా అన్నాడు: “ప్రళయ ఘడియ ఎపుడు…
ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రళయ ఘడియను గురించి ప్రశ్నిస్తూ, ఇలా అన్నాడు: “ప్రళయ ఘడియ ఎపుడు సంభవిస్తుంది?” జవాబుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “దాని కొరకు నీవు ఏమి తయారు చేసుకున్నావు?
అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రళయ ఘడియను గురించి ప్రశ్నిస్తూ, ఇలా అన్నాడు: “ప్రళయ ఘడియ ఎపుడు సంభవిస్తుంది?” జవాబుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “దాని కొరకు నీవు ఏమి తయారు చేసుకున్నావు?” అని ప్రశ్నించారు. దానికి అతడు “ఏమీ లేదు, కేవలం అల్లాహ్ పై, ఆయన సందేశహరుడు సల్లల్లాహు అలైహి వసల్లం పై (హృదయం నిండా) ప్రేమ తప్ప” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నీవు ఎవరినైతే ప్రేమిస్తున్నావో, వారితో పాటే ఉంటావు” అన్నారు. అనస్ రదియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను, అబూబకర్ మరియు ఉమర్‌లను ప్రేమిస్తున్నాను. మరియు నేను వారిలా సత్కార్యాలు ఆచరించలేక పోయినా, వారి పట్ల నాకున్న ప్రేమ కారణంగా (ప్రళయదినాన) నేను వారితో ఉండాలని ఆశిస్తున్నాను, .”
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Tiếng Việt සිංහල Kurdî Kiswahili Português አማርኛ অসমীয়া ગુજરાતી Nederlands नेपाली پښتو Svenska دری ไทย Hausa മലയാളം Кыргызча Română Oromooالشرح
ఒక ఎడారివాసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను “ప్రళయ ఘడియ ఎపుడు సంభవిస్తుంది?” అని అడిగాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని: “ఆ ఘడియ కొరకు నీవు ఏ ఏ సత్కార్యాలు ఆచరించి సిద్ధపరుచుకున్నావు?” అని ప్రశ్నించారు. ప్రశ్నించిన వ్యక్తి : "నేను అల్లాహ్’ను మరియు ఆయన సందేశహరుడిని ప్రేమిస్తున్నాను; అది తప్ప ప్రళయ ఘడియ కోసం నేను ఏ గొప్ప ఆచరణలను సిద్ధం చేసుకోలేదు" అన్నాడు; మరియు దీనిని గమనించినట్లయితే అతడు హృదయపు ఆరాధనలను, శరీరక ఆరాధనలను లేదా ఆర్థిక పరమైన ఆరాధనలను, లేక ఇతర ఏ ఆరాధనలను ప్రస్తావించలేదు; ఎందుకంటే అవన్నీ ప్రేమ యొక్క శాఖలు మరియు అవన్నీ దానిపై ఆధారపడి ఉంటాయి. నిజమైన ప్రేమ ఆ వ్యక్తిని ధర్మబద్ధమైన పనులలో కష్టపడటానికి ప్రేరేపిస్తుంది. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: “నీవు ఎవరినైతే ప్రేమిస్తున్నావో, స్వర్గములో నీవు వారితో ఉంటావు.” ఈ శుభవార్త పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబాలు అమితంగా సంతోషపడినారు. అనస్ రదియల్లాహు అన్హు – తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను, అబూ బక్ర్ మరియు ఉమర్ రదియల్లాహు అన్హుమా లను ప్రేమిస్తున్నానని; దాని కారణంగా, వారి అంత గొప్పగొప్ప ఆచరణలు ఆచరించలేకపోయినా, స్వర్గములో వారితో పాటు ఉంటాననే ఆశాభావమును వ్యక్తపరిచినారు.فوائد الحديث
ప్రశ్నించిన వ్యక్తికి సమాధానం ఇవ్వడంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివేకవంతంగా వ్యవహరించడం కనిపిస్తుంది. ప్రళయఘడియ యొక్క ఙ్ఞానము కేవలం అల్లాహ్ వద్దనే ఉన్నది అని సమాధానం ఇచ్చి ఉండవచ్చు. అలా చేయకుండా ప్రళయ ఘడియ కొరకు ఏమి అవసరమో దాని వైపునకు మార్గదర్శకం చేసారు. ప్రళయ ఘడియ ఎప్పుడు సంభవిస్తుందో తెలుసుకోవడం కంటే ప్రయోజనకరమైన మరియు ధర్మబద్ధమైన ఆచరణలతో పరలోక జీవితం కొరకు సిద్ధపడటం ముఖ్యమని అతనికి తెలిసేలా చేసారు.
ప్రళయ ఘడియ యొక్క ఙ్ఞానాన్ని అల్లాహ్ తన దాసుల నుండి దాచిపెట్టినాడు – తద్వారా దాసుడు అల్లాహ్’ను కలుసుకోవడానికి తన శాయశక్తులా సత్కార్యాలు ఆచరించి అందుకు తనను సిధ్ధ పరుచుకుంటాడని.
ఈ హదీసు లో, అల్లాహ్ పట్ల, ఆయన సందేశహరుని పట్ల మరియు సత్ప్రవర్తన కలిగిన విశ్వాసుల పట్ల ప్రేమ కలిగి ఉండడం యొక్క ఘనతను చూడవచ్చు; అలాగే బహుదైవారాధకుల పట్ల ప్రేమ కలిగి ఉండడాన్ని గురించి హెచ్చరికను చూడవచ్చు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనడం: “స్వర్గములో, నీవు ఎవరినైతే ప్రేమిస్తున్నావో, వారితో ఉంటావు” అంటే దాని అర్థము స్థాయిలో మరియు హోదాలో వారితో సమానంగా ఉంటావు అని కాదు; దాని అర్థము వారు స్వర్గంలో ఉంటారని, స్వర్గములో వారి నివాస స్థలాలు చాలా దూరంగా ఉన్నప్పటికీ, వారిలో ప్రతి ఒక్కరూ మరొకరిని చూడగలుగుతారు అని.
అలాగే ఇందులో, ముస్లిం తనకు ఏది ఉత్తమమైనది మరియు ఏది అత్యంత ప్రయోజనకరమైనది అనే విషయాలలో నిమగ్నమై ఉండాలని; అతనికి ప్రయోజనం కలిగించని వాటి గురించి ప్రశ్నించడం మానుకోవాలనే హితబోధ కనిపిస్తుంది