“మీ ఈ (ప్రపంచపు) అగ్ని, నరకాగ్ని యొక్క డెభ్భై భాగాలలో ఒకటి

“మీ ఈ (ప్రపంచపు) అగ్ని, నరకాగ్ని యొక్క డెభ్భై భాగాలలో ఒకటి

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “మీ ఈ (ప్రపంచపు) అగ్ని, నరకాగ్ని యొక్క డెభ్భై భాగాలలో ఒకటి.” అది విని మాలో ఒకరు “ఓ రసూలుల్లాహ్! (అవిశ్వాసులను శిక్షించడానికి) ఈ అగ్ని సరిపోతుంది కదా!” అని అడిగారు. దానికి ఆయన “ఈ అగ్ని కంటే నరకాగ్ని ఇంకా అరవై తొమ్మిది భాగాలు ఎక్కువ ఉంటుంది. దాని ప్రతి భాగమూ ఈ అగ్ని అంత వేడిని కలిగి ఉంటుంది” అన్నారు.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో, ఈ ప్రపంచపు అగ్ని, నరకాగ్ని యొక్క డెభ్భై భాగాలలో ఒక భాగము అని తెలియ జేస్తున్నారు. నరకాగ్ని యొక్క వేడి, ఈ ప్రపంచపు అగ్ని వేడి కంటే అరవైతొమ్మిది రెట్లు ఎక్కువగా ఉంటుంది. దాని ప్రతి భాగమూ ఈ ప్రపంచపు అగ్ని అంత వేడిని కలిగి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నారు “ఓ రసూలుల్లాహ్! నరకంలోనికి ప్రవేశించే వారిని శిక్షించడానికి ఈ అగ్ని (అంత వేడి) సరిపోతుంది కదా!” దానికి ఆయన “ఈ ప్రపంచపు అగ్ని కంటే, నరకాగ్ని అరవై తొమ్మిది రెట్లు ఘనమైనది. దాని ఒక్కొక్క భాగము యొక్క వేడి ఈ ప్రపంచపు అగ్ని అంత ఉంటుంది” అన్నారు.

فوائد الحديث

ఇందులో నరకాగ్నికి దారి తీసే ఆచరణల నుండి దూరంగా ఉండాలని ప్రజల కొరకు ఒక హెచ్చరిక ఉన్నది.

అలాగే ఇందులో (ఈ ప్రపంచపు అగ్ని కంటే) నరకాగ్ని ఎంత తీక్షణమైనదో, దాని వేడి ఈ ప్రపంచపు అగ్ని కంటే ఎంత తీవ్రమైనదో తెలుస్తున్నది.

التصنيفات

అంతిమ దినంపై విశ్వాసం., స్వర్గము,నరకము యొక్క లక్షణాలు