వీటిలో ఉన్నవారు శిక్షించబడుచున్నారు; కానీ పెద్ద పాపము చేసినందుకు కాదు. వారిలో ఒకడు మూత్రము (తనపై చిందుట) నుండి…

వీటిలో ఉన్నవారు శిక్షించబడుచున్నారు; కానీ పెద్ద పాపము చేసినందుకు కాదు. వారిలో ఒకడు మూత్రము (తనపై చిందుట) నుండి తనను తాను రక్షించుకునేవాడు కాడు, రెండవ వాడు జనుల పట్ల అపవాదులు ప్రచారం చేస్తూ ఉండేవాడు

ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు సమాధుల ప్రక్క నుండి వెళ్ళడం జరిగింది. ఆయన (అక్కడ ఆగి) ఇలా అన్నారు: “వీటిలో ఉన్నవారు శిక్షించబడుచున్నారు; కానీ పెద్ద పాపము చేసినందుకు కాదు. వారిలో ఒకడు మూత్రము (తనపై చిందుట) నుండి తనను తాను రక్షించుకునేవాడు కాడు, రెండవ వాడు జనుల పట్ల అపవాదులు ప్రచారం చేస్తూ ఉండేవాడు.” తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెట్టు నుండి ఒక తాజా రెమ్మను తీసుకుని, దానిని రెండు భాగాలుగా చీల్చి, ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క సమాధిపై ఉంచినారు. ఆయనతో ఉన్నవారు ఇలా అడిగారు: “ఓ రసూలుల్లాహ్! అలా ఎందుకు చేసినారు?” దానికి ఆయన “ఆ రెమ్మలు పచ్చగా (ఎండిపోకుండా) ఉన్నంత వరకు బహుశా వారి శిక్ష తగ్గించబడవచ్చు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు సమాధుల ప్రక్కనుండి వెళ్ళడం జరిగింది. అపుడు వారు ఇలా అన్నారు: “ఈ సమాధులలో ఉన్నవారు నిశ్చయంగా శిక్షించబడు చున్నారు. మీ దృష్టిలోని ఘోరమైన పాపములలో ఏదో ఒకటి చేసినందుకు వారు శిక్షించబడుటలేదు; కానీ అది అల్లాహ్ దృష్టిలో ఘోరమైనది. వారిలో ఒకడు మూత్ర విసర్జన చేయునపుడు మూత్రపు చుక్కలు చింది తన శరీరముపై, బట్టలపై పడకుండా జాగ్రత్త పడేవాడు కాదు. రెండవ వాడు వ్యక్తుల మధ్య విభేదాలు మరియు చీలికలను కలిగించే, ఉద్దేశ్యంతో ప్రజల మధ్య ఇతరుల మాటలను ప్రసారం చేస్తూ ఉండేవాడు.

فوائد الحديث

వ్యక్తుల మధ్య విభేదాలు మరియు చీలికలను కలిగించే, ఉద్దేశ్యంతో ప్రజల మధ్య ఇతరుల మాటలను ప్రసారం చేయడం, మరియు మూత్రపు చుక్కలు చింది మీద పడకుండా జాగ్రత్త వహించకపోవడం అనేవి సమాధిలో శిక్షకు గురి చేసే కారణాలలో ఒకటి.

అల్లాహ్ యొక్క ప్రవక్త అనే నిదర్శనాలలో భాగంగా, అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు కొన్ని అగోచర విషయాలను (కంటికి కనిపించని విషయాలను) బహిర్గతం చేసేవారు – ఉదాహరణకు సమాధిలో విధించబడే శిక్ష.

చెట్టు యొక్క రెమ్మను విరిచి, రెండు భాగాలుగా చేసి వాటిని రెండు సమాధులపై ఉంచడం అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మాత్రమే ప్రత్యేకం. ఎందుకంటే ఆ సమాధులలో ఉన్న వారి పరిస్థితిని గురించిన సమాచారాన్నిఅల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు తెలియజేసినాడు. కనుక మరింకెవ్వరికీ ప్రత్యేకం కాదు, ఎందుకంటే సమాధులలో ఉన్నవారి పరిస్తితి ఏమిటో ఎవ్వరూ ఎరుగరు.

التصنيفات

బర్జఖ్ జీవితం, దుర్గుణాలు, సమాధుల భయానక పరిస్థితులు