. .

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీరు యూదులతో యుద్ధం చేయనంత వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు. తన వెనుక దాగి ఉన్న యూదుని గురించి ఒక శిల “ఓ ముస్లిమా! ఓ యూదుడు నా వెనుక దాగి ఉన్నాడు. వాడిని సంహరించు” అని పలికేటంత వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ముస్లిములు మరియు యూదులు ఒకరితోనొకరు యుద్ధానికి పాల్బడనంత వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు అని తెలియజేస్తున్నారు. (ఆ యుద్ధంలో) ఒకవేళ యూదుడు ఒక శిల వెనుక దాక్కోవడానికి పారిపోయినా, అల్లాహ్ (తన అనుఙ్ఞతో) ఆ శిల మాట్లాడేలా చేస్తాడు. దానితో అది ముస్లిమును కేకవేసి తన వెనుక యూదుడు దాక్కుని ఉన్నాడని అంటుంది. అతడు వచ్చి యూదుడిని సంహరించే వరకు అలా అంటూనే ఉంటుంది.

فوائد الحديث

ఈ హదీసులో, అగోచర విషయాలకు సంబంధించి భవిష్యత్తులో జరుగబోయే కొన్ని విషయాలను, మహోన్నతుడైన అల్లాహ్ ఆయనకు తెలియ జేసిన విధంగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలియ జేస్తున్నారు. అది అనివార్యంగా జరిగి తీరుతుంది.

ఈ ప్రపంచపు ఆఖరి దినాలలో ముస్లిములు యూదులతో యుద్ధం చేస్తారు. ప్రళయ ఘడియ యొక్క నిదర్శనాలలో ఇది ఒకటి.

ఈ హదీసులో – ప్రళయ దినము స్థాపించబడేటంత వరకూ ఇస్లాం ధర్మము పరిరక్షించబడి ఉంటుందని, మిగతా ధర్మములపై ఇస్లాం ధర్మము యొక్క ప్రాబల్యము ఉంటుందని తెలుస్తున్నది.

అలాగే ఈ హదీసులో ముస్లిములకు, వారి శత్రువులకు వ్యతిరేకంగా అల్లాహ్ నుండి సహాయం అందుతుందని, అందులో భాగంగానే, యుగాంతంలో అల్లాహ్ శిలను సైతం మాట్లాడేలా చేస్తాడని తెలుస్తున్నది.

التصنيفات

బర్జఖ్ జీవితం