“దజ్జాల్ ను గురించి అల్లాహ్ యొక్క ఏ ప్రవక్త కూడా తన జాతి జనులకు చెప్పని ఒక విషయాన్ని నేను మీకు చెప్పనా? అతడు…

“దజ్జాల్ ను గురించి అల్లాహ్ యొక్క ఏ ప్రవక్త కూడా తన జాతి జనులకు చెప్పని ఒక విషయాన్ని నేను మీకు చెప్పనా? అతడు ఒంటికన్ను వాడు; అతడు తన వెంట స్వర్గాన్నీ మరియు నరకాన్నీ పోలిన దానిని తీసుకుని వస్తాడు

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “దజ్జాల్ ను గురించి అల్లాహ్ యొక్క ఏ ప్రవక్త కూడా తన జాతి జనులకు చెప్పని ఒక విషయాన్ని నేను మీకు చెప్పనా? అతడు ఒంటికన్ను వాడు; అతడు తన వెంట స్వర్గాన్నీ మరియు నరకాన్నీ పోలిన దానిని తీసుకుని వస్తాడు. అయితే అతడు దేనినైతే స్వర్గం అని అంటాడో (వాస్తవానికి) అది నరకం. కనుక నూహ్ అలైహిస్సలాం తన జాతి జనులను ఏ విధంగానైతే హెచ్చరించినాడో నేనూ ఆ విధంగా మిమ్ములను హెచ్చరిస్తున్నాను.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహబాలకు దజ్జాల్’ను గురించి, అతని లక్షణాలను గురించి, అతనికి సంబంధించిన చిహ్నాలను గురించి – తన కంటే ముందు వచ్చిన ఏ ప్రవక్తా కూడా తన జాతి జనులకు చెప్పని విషయాలను వివరిస్తున్నారు. ఉదాహరణకు: అతడు ఒంటి కన్ను వాడు. మరియు కంటికి స్వర్గము మరియు నరకముల వలే కనిపించే, స్వర్గము మరియు నరకములను పోలిన వాటిని తయారు చేసి, సర్వోన్నతుడైన అల్లాహ్ దజ్జాల్ తో పంపిస్తాడు. కానీ అతడి స్వర్గము, వాస్తవానికి నరకం, అలాగే అతడి నరకం వాస్తవానికి స్వర్గం అయి ఉంటాయి. ఎవరైతే అతడిని (విశ్వసించి) అనుసరిస్తారో, ప్రజలు చూస్తుండగా అతడు వారిని స్వర్గములోనికి ప్రవేశింపజేస్తాడు, కానీ వాస్తవానికి అది భగభగ మండే అగ్ని అయి ఉంటుంది; అలాగే ఎవరైతే అతడిని (విశ్వసించరో) అనుసరించడానికి నిరాకరిస్తారో, అతనికి అవిధేయత చూపుతారో, ప్రజలు చూస్తుండగా అతడు వారిని నరకములోనికి ప్రవేశింపజేస్తాడు, కానీ వాస్తవానికి అది మంచి స్వర్గం అయి ఉంటుంది. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడు సృష్టించే అరాచకత్వాన్ని గురించి, అతడి పరీక్షల గురించి, నూహ్ అలైహిస్సలాం తన ప్రజలను హెచ్చరించిన విధంగా హెచ్చరించినారు.

فوائد الحديث

ఇందులో దజ్జాల్ యొక్క భయంకరమైన ఉపద్రవం, అరాచకత్వమును గురించి తెలియుచున్నది.

ఇందులో దజ్జాల్ యొక్క భయంకరమైన ఉపద్రవం, అరాచకత్వమును గురించి తెలియుచున్నది.

దజ్జాల్ యొక్క మహా ఉపద్రవం నుండి విమోచన అల్లాహ్ యందు కల్మషం లేని విశ్వాసము ద్వారా, అల్లాహ్ ను ఆశ్రయించడం ద్వారా, (నమాజులో) చివరి తషహ్హుద్ లో దజ్జాల్ ఉపద్రవం నుండి రక్షించమని ఆయన శరణు వేడుకోవడం ద్వారా; మరియు సూరహ్ అల్ కహఫ్ యొక్క మొదటి పది ఆయతులను కంఠస్థం చేయడం ద్వారా మాత్రమే సాధ్యము.

التصنيفات

అంతిమ దినంపై విశ్వాసం., ప్రళయ సూచనలు., దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్యం