. .

అబూ దర్దా రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఎవరైతే సూరతుల్ కహఫ్ యొక్క మొదటి పది ఆయతులను (వచనాలను) కంఠస్థం చేస్తారో, వారు దజ్జాల్ ఫిత్నా నుండి రక్షించబడతారు." మరొక రివాయతులో "సూరతుల్ కహఫ్ యొక్క చివరి పది ఆయతులు." అని ఉంది.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు: 'ఎవరైతే సూరతుల్ కహఫ్ ప్రారంభం నుండి పది ఆయతులను కంఠస్థము చేస్తారో, వారు చివరి కాలంలో ప్రత్యక్షమయ్యే, దైవత్వాన్ని ప్రకటించుకునే దజ్జాల్ యొక్క పరీక్ష నుండి సంరక్షించబడతారు, కాపాడబడతారు మరియు రక్షించబడతారు. దజ్జాల్ పరీక్ష, ఆదామ్ అలైహిస్సలాం సృష్టి నుండి ప్రళయ దినం వరకు భూమిపై సంభవించే పరీక్షలలో అతి గొప్ప పరీక్ష. ఎందుకంటే మహోన్నతుడై అల్లాహ్, దజ్జాల్ ప్రజలను మోసగించేలా అనేక అసాధారణ శక్తులను ప్రదర్శించే అనుమతి అతడికి ఇస్తాడు. ఈ సంరక్షణ రహస్యం: సూరతుల్ కహ్ఫ్ ప్రారంభంలోని ఆయతులలో దజ్జాల్ ప్రదర్శించే అద్భుతాల కంటే గొప్ప అద్భుతాలు మరియు సూచనలను కలిగి ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈ ఆయతులను పఠిస్తూ ఉంటారో, వారు దజ్జాల్ చేత మోసపోరు. మరొక హదీథు ప్రకారం: 'సూరహ్ చివరి పది ఆయతులను - అల్లాహ్ వాక్కు {అఫహసిబల్లదీన కఫరూ (అవిశ్వాసులు నా దాసులను...} (18:102) నుండి ప్రారంభమయ్యే సూరహ్ చివరి భాగాన్ని కంఠస్థం చేసిన వారికి కూడా ఈ సంరక్షణ లభిస్తుంది.'"

فوائد الحديث

సూరతుల్-కహఫ్ యొక్క విశిష్ఠత, ఔన్నత్యం మరియు దాని ప్రారంభం లేదా ముగింపులు దజ్జాల్ ఫిత్నా నుండి రక్షిస్తాయని స్పష్టం చేయబడింది.

ఈ హదీథు దజ్జాల్ ఫిత్నా గురించి వివరిస్తూ, వాడి నుండి రక్షణ పొందే మార్గాన్ని సూచిస్తున్నది.

సూరతుల్ కహఫ్ ను పూర్తిగా కంఠస్థము చేసేందుకు ప్రయత్నించండి! ఒకవేళ దీన్ని పూర్తిగా కంఠస్థము చేయడం సాధ్యం కాకపోతే, దాని మొదటి పది ఆయతులను మరియు చివరి పది ఆయతులను (18:102 నుండి) తప్పక కంఠస్థము చేసుకోండి. ఈ ప్రయత్నం దజ్జాల్ యొక్క ఫిత్నా నుండి మీకు సంరక్షణను అందిస్తుంది."

"ఇమాముల్-కుర్తుబీ (రహిమహుల్లాహ్) ఈ సంరక్షణకు కారణం వివరిస్తూ: 'ఇది గుహ వారి (అహ్లుల్ కహ్ఫ్) కథలోని అద్భుతాలు మరియు సూచనల కారణంగా ఉంటుందని చెప్పబడింది. ఎవరైతే ఈ కథపై ధ్యానిస్తారో, వారు దజ్జాల్ విషయంలో ఆశ్చర్యపోరు మరియు భయభ్రాంతులకు గురి కారు - తద్వారా వాడి చేత మోసపోరు. మరొక వివరణ ప్రకారం, ఇది అల్లాహ్ వాక్కు {కఠినమైన శిక్షను హెచ్చరించడానికి} (18:2) కారణంగా ఉంటుంది. ఇది శిక్ష యొక్క తీవ్రత మరియు దైవ మూలాన్ని నొక్కి చెబుతుంది - ఇది దజ్జాల్ యొక్క దైవత్వ దావాలు, వాడి ఆధిపత్యం మరియు వాడి ఫిత్నా యొక్క విపరీతమైన స్వభావానికి ప్రత్యక్ష ప్రతిస్పందన. ఈ కారణాల వలననే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం: దజ్జాల్ ఫిత్నా గంభీరతను నొక్కి వక్కాణించారు. వాడి గురించి తీవ్రంగా హెచ్చరించారు. వాడి ఫిత్నా నుండి అల్లాహ్ వద్ద సంరక్షణ వేడుకున్నారు.

التصنيفات

సూరాలు మరియు ఆయతుల ప్రాముఖ్యతలు., ప్రళయ సూచనలు.