“రాత్రింబవళ్ళు ఎక్కడెక్కడి వరకు చేరుకుంటాయో అక్కడి వరకు నిశ్చయంగా ఈ విషయం (ఇస్లాం) చేరుకుంటుంది. అది పల్లె…

“రాత్రింబవళ్ళు ఎక్కడెక్కడి వరకు చేరుకుంటాయో అక్కడి వరకు నిశ్చయంగా ఈ విషయం (ఇస్లాం) చేరుకుంటుంది. అది పల్లె గానీ లేదా పట్టణం గానీ లేదా ఎడారి గానీ, అల్లాహ్ ఏ ఒక్క ఇంటినీ విడిచి పెట్టకుండా ఈ ధర్మాన్ని (ఇస్లాంను) ప్రవేశింపజేస్తాడు

తమీమ్ అద్దారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతుండగా నేను విన్నాను: “రాత్రింబవళ్ళు ఎక్కడెక్కడి వరకు చేరుకుంటాయో అక్కడి వరకు నిశ్చయంగా ఈ విషయం (ఇస్లాం) చేరుకుంటుంది. అది పల్లె గానీ లేదా పట్టణం గానీ లేదా ఎడారి గానీ, అల్లాహ్ ఏ ఒక్క ఇంటినీ విడిచి పెట్టకుండా ఈ ధర్మాన్ని (ఇస్లాంను) ప్రవేశింపజేస్తాడు; తద్వారా గౌరవనీయులకు గౌరవాన్ని ప్రసాదిస్తూ, అవమానకరమైన వారిని అవమానం పాలు చేస్తూ; ఇక్కడ గౌరవం అంటే ఇస్లాం ద్వారా కలుగజేయబడే గౌరవం; మరియు అవమానం అంటే అవిశ్వాసం ద్వారా కలుగజేయబడే అవమానం.” తమీమ్ అద్దారీ రజియల్లాహు అన్హు ఇలా అంటూ ఉండేవారు: “వాస్తవంలో నా కుటుంబ సభ్యులలోనే ఇలా జరగడం నాకు తెలుసు. వారిలో ఇస్లాం స్వీకరించిన వారికి వాస్తవంగా శుభాలు, గౌరవం మరియు కీర్తి లభించాయి; మరియు వారిలో ఎవరైతే సత్యతిరస్కారులై, అవిశ్వాసులుగా ఉండిపోయారో, వాస్తవములో వారు అధోగతి పాలై, అవమానం పాలై, ‘జిజియా’ చెల్లించే స్థితిలో ఉండిపోయారు.”

[దృఢమైనది] [దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథులో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా తెలియజేస్తున్నారు: భూమి యొక్క అన్ని ప్రాంతాలకు ఈ ధర్మం వ్యాపిస్తుంది, రాత్రింబవళ్ళు ఎక్కడెక్కడికి చేరుకుంటాయో, ఈ ధర్మం అక్కడి వరకు చేరుకుంటుంది అని. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఈ ధర్మాన్ని ప్రవేశపెట్టకుండా ఏ ఇంటినీ వదిలి పెట్టడు, పట్టణాలలో, గ్రామాలలో, ఎడారిలో లేదా అరణ్యంలో ఎక్కడైనా సరే. ఎవరైతే ఈ ధర్మాన్ని అంగీకరించి, స్వీకరిస్తారో, దానిని విశ్వసిస్తారో వారు (అల్లాహ్) ఇస్లాంకు ప్రసాదించే గౌరవంతో గౌరవించబడతారు, మరియు ఎవరైతే దానిని తిరస్కరిస్తారో, మరియు ఆ ధర్మాన్ని విశ్వసించరో, అలాంటి వారు అవమానానికి, పరాభవానికి గురిచేయబడతారు. ఈ హదీసు ఉల్లేఖించిన సహాబీ తమీమ్ అద్దారీ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా తెలియజేసారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ ప్రకటన నిజమవడాన్ని తాను చూశానని, ముఖ్యంగా తన కుటుంబ సభ్యులలో - ఎవరైతే ఇస్లాం స్వీకరించినాడో, అతడు మంచితనం, గౌరవం మరియు కీర్తిని పొందాడు, మరియు ఎవరైతే అవిశ్వాసిగానే మిగిలి పోయాడో, అతడు ముస్లింలకు జీజియాగా డబ్బు చెల్లించవలసి రావడంతో పాటు, అవమానానికి మరియు పరాభవానికి గురయ్యాడు.

فوائد الحديث

ఈ హదీసులో ముస్లిములందరికీ ఒక శుభవార్త ఉన్నది, అదేమిటంటే వారి ధర్మం భూమిపై ప్రతి ఒక్క భాగానికి వ్యాపిస్తుంది.

ఇస్లాం కు మరియు ముస్లిములకు గౌరవం, మరియు అవిశ్వాసులకు అవమానాలు, పరాభవం ఉంటాయి.

ఈ హదీసు ప్రవక్తత్వానికి సంబంధించిన సంకేతాలలో ఒక సంకేతాన్ని కలిగి ఉంది, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలియజేసినట్లుగానే ఈ విషయం సంభవించింది.

التصنيفات

ప్రళయ సూచనలు.