“నా నీటి తొట్టి (ఎంత పెద్దది అంటే) దాని రెండు అంచుల మధ్య దూరం ఒక నెల ప్రయాణమంత ఉంటుంది. దాని నీరు పాల కన్నా…

“నా నీటి తొట్టి (ఎంత పెద్దది అంటే) దాని రెండు అంచుల మధ్య దూరం ఒక నెల ప్రయాణమంత ఉంటుంది. దాని నీరు పాల కన్నా తెల్లనైనవి; దాని సువాసన కస్తూరీ గంధము కన్న మధురమైనది

అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నా నీటి తొట్టి (ఎంత పెద్దది అంటే) దాని రెండు అంచుల మధ్య దూరం ఒక నెల ప్రయాణమంత ఉంటుంది. దాని నీరు పాల కన్నా తెల్లనైనవి; దాని సువాసన కస్తూరీ గంధము కన్న మధురమైనది; దాని నుండి నీటిని త్రాగడానికి వాడే కప్పులు ఆకాశములో నక్షత్రాల వంటివి; దాని నుండి నీటిని త్రాగిన వారెవరూ మరింకెన్నడూ దాహానికి లోను కారు”.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీర్పు దినమున తనకు ఒక తొట్టి ప్రసాదించబడుతుందని, దాని పొడవు, వెడల్పుల రెండు అంచుల మధ్య దూరము ఒక నెల ప్రయాణమంత ఉంటుందని తెలియ జేస్తున్నారు. మరియు దాని నీరు పాలకన్నా తెల్లగా ఉంటాయి. దాని సువాసన యొక్క మాధుర్యం కస్తూరీ గంధపు సువాసన కన్నా మధురంగా ఉంటుంది. దాని నుండి నీటిని త్రాగడానికి వాడే కప్పులు ఆకాశములో నక్షత్రాల మాదిరి అసంఖ్యాకంగా ఉంటాయి. ఆ కప్పులతో అందులోని నీటిని త్రాగిన వారెవరూ ఇంకెన్నడూ దాహానికి లోను కారు.

فوائد الحديث

తీర్పు దినమున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక నీటి తొట్టి (చెలమ) ఉంటుంది, దానిలో అపారంగా నీళ్ళు ఉంటాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మత్ లోని మోమినులందరూ ఆ నీటి తొట్టి వద్దకు వస్తారు.

ఈ హదీసులో ఆ నీటి తొట్టి నుండి నీరు త్రాగే వారికి కలిగే శుభాన్ని గురించి తెలుపబడింది; వారికి ఇంకెన్నడూ దాహం వెయ్యదు.

التصنيفات

అంతిమ దినంపై విశ్వాసం.