మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారితో‘అన్నుష్ర ’{మంత్ర విద్యను మంత్ర విద్య తో దూరం చేయడం} గురించి…

మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారితో‘అన్నుష్ర ’{మంత్ర విద్యను మంత్ర విద్య తో దూరం చేయడం} గురించి ప్రశ్నించటం జరిగింది,ఆయన అది షైతాన్ చర్య అని బదులిచ్చారు.

జాబిర్ రజియల్లాహు అన్హుఉల్లేఖనం : మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారితో ‘అన్నుష్ర ’{మంత్ర విద్యను మంత్ర విద్య తో దూరం చేయడం} గురించి ప్రశ్నించటం జరిగింది,ఆయన అది షైతాన్ చర్య అని బదులిచ్చారు.

[దృఢమైనది] [దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు - దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు]

الشرح

అజ్ఞానకాలం లోని జనులు ఆచరించే మాంత్రిక విద్యతో చేసే చికిత్స గురించి దాని ఆదేశమేమిటి అని మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లమ్’తో ప్రశ్నించగా?ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ బదులిస్తూ–నిశ్చయంగా అది షైతాన్ చర్య లేదా షైతాన్ సహాయం ఉపయోగించే చర్య,ఎందుకంటే జాదూలో ఎన్నో రకాల తాంత్రిక విద్యలతో పాటు,షైతాన్ సహాయం కూడా ఉంటుంది కాబట్టి ఇది షిర్కుతో కూడిన ఒక షైతాన్ చర్య,కాబట్టి దీన్ని‘రుఖియ లేదా మంత్రించిన దాన్నివెలికి తీసి చేతితో నష్టపరచి దూరం చేయొచ్చు,ఖుర్ఆన్ పారాయణం చేస్తూ హలాల్ మందులను ఉపయోగించి కూడా చేతబడి ని నష్టపర్చవచ్చు.

فوائد الحديث

హరామ్ లో పడకుండా సంరక్షించుకోవటానికి ఉలమాలను క్లిష్టతరమైన సమస్యలను అడిగి తెలుసుకోవడం షరీఅతు బద్దమైన విషయము.

అజ్ఞాన కాలంలో ప్రాచుర్యమైన“అన్నష్రత”-(మాంత్రిక విద్యను మంత్రవిద్య తో తొలగించడం) వారించబడింది,ఎందుకంటే అదే ‘చేతబడి,మరియు చేతబడి కుఫ్ర్ అవుతుంది.

నిశ్చయంగా షైతాన్ చేష్టలన్నీ పూర్తిగా హరాము చేయబడ్డాయి

التصنيفات

అజ్ఞాన కాలపు సమస్యలు, బహుదైవారాధన (షిర్క్)