ప్రవక్తల్లోని ప్రతీ ఒక్క ప్రవక్తకు అద్భుతాలు ఇవ్వబడ్డాయి,ఆ ప్రకారంగా వారి ప్రజలు విశ్వసించేవారు

ప్రవక్తల్లోని ప్రతీ ఒక్క ప్రవక్తకు అద్భుతాలు ఇవ్వబడ్డాయి,ఆ ప్రకారంగా వారి ప్రజలు విశ్వసించేవారు

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: «ప్రవక్తల్లోని ప్రతీ ఒక్క ప్రవక్తకు అద్భుతాలు ఇవ్వబడ్డాయి,ఆ ప్రకారంగా వారి ప్రజలు విశ్వసించేవారు, నిశ్చయంగా నాకు దైవవాణి (ఖుర్ఆన్) ఇవ్వబడింది,అల్లాహ్ దాన్ని నా వైపుకు పంపాడు, కాబట్టి ప్రళయదినాన అత్యధిక అనుచరులు నాకు ఉంటారని నేను ఆశిస్తున్నాను».

[ప్రామాణికమైన హదీథు] [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: అల్లాహ్ ప్రవక్తలందరికీ మద్దతునిచ్చి, వారి దైవదౌత్యానికి నిదర్శనంగా ఉండే అసాధారణ అద్భుతాలను వారికి ప్రసాదించాడు, వాటిని చూసినవారు వారి సత్యసంధతను విశ్వసించవలసి వచ్చేది మరియు ఆ సవాలులో అవిశ్వాసి దానిని తిప్పికొట్టలేక నిస్సహాయుడైపోయేవాడు, కానీ అతను దానిని తిరస్కరించి మొండిగా ప్రవర్తించేవాడు. నిశ్చయంగా ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం యొక్క అద్భుతం మరియు మహిమ అల్లాహ్ ఆయనపై అవతరింపజేసిన ఖుర్ఆన్. ఎందుకంటే దానిలో స్పష్టమైన మరియు నిరంతరమైన అద్భుతాలు ఉన్నాయి, దాని ప్రయోజనాలు అధికంగా మరియు సర్వవ్యాప్తిగా ఉన్నాయి. అంతేగాక దానిలో (ఇస్లాం వైపు) ఆహ్వానం, సాక్ష్యం మరియు భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి సమాచారం ఉంది. అందువల్ల దాని ప్రయోజనం అక్కడ హాజరైన వారికి, హాజరు కాలేక పోయిన వారికి, ఉన్నవారికి మరియు భవిష్యత్తులో ఉండబోయేవారికి అందరికీ చేరుతుంది. ఆ తర్వాత ఆయన ఇలా అన్నారు: "కాబట్టి ప్రళయ దినాన వారిలో అత్యధిక అనుచరులు కలవాడిని నేనే అవుతానని ఆశిస్తున్నాను.

فوائد الحديث

ప్రవక్తల కొరకు మహిమలను నిరూపించడం అనేది సమాజాలపై మహోన్నతుడైన అల్లాహ్ యొక్క కరుణ మరియు ఆయన అనుగ్రహం.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్ప అద్భుతం, మహిమ గురించి వివరించబడింది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మహోన్నత స్థానము మరియు సమస్త ప్రవక్తలపై వారి ఘనమైన విశిష్టత గురించి ప్రకటించబడింది.

ఇమాం ఇబ్నె హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) "నిశ్చయంగా నాకు దైవవాణి ఇవ్వబడింది,అల్లాహ్ ’దానిని నా వైపుకు పంపాడు" అనే ఈ వాక్యం గురించి వివరిస్తూ ఇలా అన్నారు: దీని అర్థం ఆయన అద్భుతాలు దీనికి (ఖుర్ఆన్’కు) మాత్రమే పరిమితం అని కాదు మరియు ఆయన కంటే ముందు వచ్చిన ప్రవక్తలకు ఇవ్వబడిన అద్భుతాలు ఆయనకు ఇవ్వబడలేదని కూడా కాదు. దానికి బదులుగా, దీని ఉద్దేశ్యం ఏమిటంటే, ఇది ఇతరుల కంటే భిన్నంగా ఆయనకు ప్రత్యేకంగా ఇవ్వబడిన గొప్ప అద్భుతం.

ఇమాం అన్నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: "(కాబట్టి నేను వారిలో అత్యధిక అనుచరులు గలవాడినై ఉండాలని ఆశిస్తున్నాను)" అన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ మాట, ప్రవక్తత్వపు నిదర్శనాలలో ఒక నిదర్శనం. ఎందుకంటే వారు ఈ విషయాన్ని ముస్లింల సంఖ్య చాలా తక్కువగా ఉన్న కాలంలో తెలియజేసినారు. ఆ తర్వాత అల్లాహ్ తఆలా తన అనుగ్రహాన్ని కురిపించి, ముస్లింలకు విజయాలను ప్రసాదించి, వారిలో శుభాలను (బరకత్) ఇచ్చాడు. చివరికి ముస్లింల వ్యవహారం మనందరికీ తెలిసిన ఈ స్థాయికి విస్తరించింది. సకల ప్రశంసలు అల్లాహ్ కే శోభిస్తాయి.

التصنيفات

Meanings and Attributes of the Qur'an, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం