“ప్రజలు శుక్రవారం ప్రార్థనను (సలాతుల్ జుము’ఆను) నిర్లక్ష్యం చేయడం మానేయాలి, లేకపోతే అల్లాహ్ వారి హృదయాలపై…

“ప్రజలు శుక్రవారం ప్రార్థనను (సలాతుల్ జుము’ఆను) నిర్లక్ష్యం చేయడం మానేయాలి, లేకపోతే అల్లాహ్ వారి హృదయాలపై ముద్ర వేస్తాడు మరియు వారు ఉపేక్షించబడిన వారిలో ఉండిపోతారు.”

అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ మరియు అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హుమా) తాము రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మెంబరుపై (ప్రసంగ వేదికపై) నిలబడి ఇలా అనగా విన్నాము అని ఉల్లేఖిస్తున్నారు: “ప్రజలు శుక్రవారం ప్రార్థనను (సలాతుల్ జుము’ఆను) నిర్లక్ష్యం చేయడం మానేయాలి, లేకపోతే అల్లాహ్ వారి హృదయాలపై ముద్ర వేస్తాడు మరియు వారు ఉపేక్షించబడిన వారిలో ఉండిపోతారు.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మెంబరుపై (ప్రసంగ వేదికపై) నిలబడి శుక్రవారం ప్రార్థనను నిర్లక్ష్యం చేయరాదని, సరియైన కారణం లేకుండా సోమరితనం లేదా అజాగ్రత్త కారణంగా శుక్రవారం నమాజును తప్పిపోకూడదని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హెచ్చరించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా అన్నారు ‘సత్యాన్ని అనుసరించకుండా నిరోధించే ఒక అడ్డంకితో అల్లాహ్ వారి హృదయాలను కప్పివేసి, వాటిని సీలు చేస్తాడు. ఫలితంగా, వారు మంచితనం యొక్క మార్గాలను పట్టించుకోని, లక్ష్యములేని వారిలో ఒకరిగా మిగిలిపోతారు. వారి ఆత్మలు విధేయత ఆచరణల నుండి తప్పుకుంటాయి.

فوائد الحديث

శుక్రవారపు ప్రార్థన (నమాజును)తప్పిపోవడం పట్ల కాఠిన్యం వహించబడినది; ఎందుకంటే అది ‘ఘోరమైన పాపములలో’ (కబాయిర్ లలో) ఒకటి.

ఇమాం నవవి రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: శుక్రవారం ప్రార్థన (జుమా నమాజు) ఆచరించడం ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత విధి అని ఇది సూచిస్తున్నది.

ప్రసంగించడానికి ప్రసంగ వేదికను (మెంబర్’ను) ఉపయోగించుట షరియత్ ప్రకారం సరియైనదే.

అల్-సిందీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ‘దీని అర్థం ఏమిటంటే రెండు విషయాలలో ఒకటి అనివార్యంగా జరుగుతుంది – వారు శుక్రవారం నమాజును తప్పిపోవడం మానేస్తారు, లేదా సర్వ శక్తిమంతుడైన అల్లాహ్ వారి హృదయాలపై ముద్ర (సీలు) వేస్తాడు. శుక్రవారం నమాజును అలవాటుగా తప్పిపోవడం వల్ల హృదయంలో స్తబ్దత ఏర్పడుతుంది మరియు ఆత్మలు ఆరాధనలపై (ఇబాదాత్’లపై) ఆసక్తిని కోల్పోతాయి.

బోధకుడు మరియు హెచ్చరిక చేసే వ్యక్తి తాను బోధించాలనుకుంటున్న వ్యక్తుల పేర్లను అస్పష్టంగానే ఉండనివ్వాలి, ఎందుకంటే ఈ విధానం వారు సలహాలను అంగీకరించడానికి మరియు ఆదేశాలను పాటించడానికి మరింత అనుకూలంగా ఉంటుంది, వారికి ఎక్కువ అవకాశం కల్పిస్తుంది.